Breaking News

అక్కడ పది పైసలకే బిర్యానీ

11 th Oct 2020, UTC
అక్కడ పది పైసలకే బిర్యానీ

చెన్నై :బిర్యానీకి ఉన్న ఈ క్రేజ్‌తో చాలామంది వ్యాపారులు ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. వంద రూపాయలు, యాభై రూపాయలు, పదిరూపాలయకే బిర్యానీ అంటూ ఇప్పటివరకు రకరకాల ఆఫర్ల గురించి విన్నాం. అయితే ఇప్పుడు తాజాగా 10 పైసలకు బిర్యానీ అంటూ ఆఫర్ ఇవ్వడం విశేషం.

ఈ రోజు(అక్టోబర్‌ 11) బిర్యానీ డే సందర్భంగా తమిళనాడు బిర్యానీ వ్యాపారులు భారీ ఆఫర్లను ప్రకటించారు. తిరుచ్చి, మధురై, దింగిగల్, చెన్నైలలో 10 పైసలకే బిర్యానీ అమ్మకాలు నిర్వహించారు. దీంతో భారీగా జనం ఎగబడ్డారు. కిలో మీటర్ల మేర బారులు తీశారు. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా బిర్యానీ కోసం స్థానికులు క్యూకట్టారు. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించి బిర్యానీ ఆఫర్లను ప్రకటించిన వ్యాపారుల పై మున్సిపల్‌ అధికారులు కేసు నమోదు చేశారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox