Breaking News

విలేజ్ కుకింగ్ చానెల్ కు కోటిమంది సబ్ స్క్రైబర్లు

06 th Jul 2021, UTC

తమిళనాడుకు చెందిన యూ ట్యూబ్ చానెల్ విలేజ్ కుకింగ్ చానల్  కు కోటి మంది చందాదారులను కలిగిన మొదటి తమిళ చానెల్ గా అవతరించింది. తమిళనాడు పుదుక్కొట్టై జిల్లా చిన్న వీరమంగళం గ్రామానికి చెందిన పెరియతంబి అనే వృద్ధుడు గతంలో వంట మాస్టర్‌గా పని చేసేవారు. ఈ క్రమంలో పెరియతంబి, ఆయన మనవలు కలిసి కొన్నెళ్ల క్రితం యూట్యూబ్‌లో విలేజ్‌ కుకింగ్‌ పేరిట ఓ చానెల్‌ ప్రారంభించారు. పెరియతంబి చేత సంప్రదాయ వంటలు చేయించి, ఆ వీడియోలని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేవారు.

కొన్నిరోజుల కిందట  జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ వీరిని కలిశారు. వీరితో పాటు  పుట్టగొడుగుల బిర్యానీ తయారు చేసి, అక్కడే కూర్చోని  తిన్నారు. దాంతో ఈ చానెల్‌ పేరు దేశవ్యాప్తంగా అందరికి తెలిసింది. అప్పటివరకు వారానికి 10 వేలుగా ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్య రాహుల్‌ గాంధీ వీరి వీడియోలో కనిపించిన తర్వాత 40-50 వేలకు పెరిగింది. ఇక రాహుల్‌ గాంధీ కనిపించిన వీడియో ఏకంగా 26 మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది. 

మాకు రోజుకు 10,000 మంది కొత్త చందాదారులు వుండేవి. అయితే రాహుల్ గాంధీ సందర్శించినప్పటి నుండి, మేము రోజుకు 30,000 నుండి 40,000 మంది కొత్త చందాదారులను పొందుతున్నామంటూ బృందం యొక్కకెమెరామెన్ మరియు సాంకేతిక నిపుణుడు సుబ్రమణియన్ చెప్పారు. వీరు యూట్యూబ్‌ వ్యూస్‌ ద్వారా నెలకు రూ.7 లక్షల రూపాయల యాడ్‌ రెవిన్యూ సంపాదిస్తున్నారు

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox