వెజిటేరియన్ పిజ్జాను ఆర్డర్ చేస్తే నాన్-వెజ్ పిజ్జా డెలివరీ చేయడంతో అమెరికన్ రెస్టారెంట్ ఔట్‌లెట్‌పై ఓ మహిళ వినియోగదారుల కోర్టులోరూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని కేసు వేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్ కు చెందిన దీపాళీ త్యాగి 2019 మార్చి 21న అమెరికన్ రెస్టారెంట్ ఔట్లెట్ నుంచి పుట్టగొడుగుల పిజ్జాను ఆర్డర్ చేశారు. అయితే, చెప్పిన సమయం కంటే ఆలస్యంగా డెలివరీ చేయడమే కాకుండా వెజ్‌కు బదులు నాన్-వెజ్ పిజ్జాను ఇచ్చారు.
రుచి చూసిన తర్వాత గానీ అది నాన్-వెజ్ పిజ్జా అని ఆమెకు తెలియలేదు. ఆ రోజు హోళీ కావడంతో తాను, పిల్లలు పండుగ సంబరాలు చేసుకుని అలసిపోయి, బాగా ఆకలి వేయడంతో పిజ్జాను ఆర్డర్ చేశామని తెలిపారు. పిజ్జాపై ఉన్న మాంసం ముక్కలను పుట్టగొడుగులుగా భావించి తిన్నామని అన్నారు. తాము పూర్తిగా శాకాహారులమని, మతపరంగా తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆమె అన్నారు.
ఈ అపరాధ భావన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుందని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.వెజ్‌కు బదులు నాన్-వెజ్‌ను ఎందుకు పంపారని ప్రశ్నిస్తే రెస్టారెంట్ మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని దీపాళీ ఆరోపించింది. అంతేకాదు, తమకు ఉచితంగా పిజ్జాలను ఇస్తామని సామాజిక, ఆర్ధిక హోదాలను కించపరిచారని దీపాళీ తరఫున లాయర్ ఫర్హత్ వార్సీ దాఖలు చేసిన పిటిషన్లో తెలిపారు

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
14 Apr 2021
11 Apr 2021
16 Apr 2021
16 Apr 2021
16 Apr 2021