Breaking News

పచ్చిమిరప, తులసి, పుదీనాలతో రసగుల్లాలు రాంచీలో స్వీట్స్ వ్యాపారి ప్రయోగాలు

03 rd Nov 2020, UTC

రాంచీ :కరోనామహమ్మారి నేపధ్యంలో ప్రజలు వారి రోగనిరోధక శక్తిని పెంచడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. దీనితో రాంచీలోని స్థానిక మిఠాయి వ్యాపారి కమల్ అగర్వాల్ తాను అమ్మే రసగుల్లాలను పలు రకాల్లో అమ్మడం మొదలు పెట్టాడు.అగర్వాల్ తాను తయారు చేసే రసగుల్లాలకు పచ్చిమిర్చి, వెల్లుల్లి, పసుపు వాడతానని  చెప్పాడు. అంతేకాదు హల్ది, పచ్చిమిర్చి, తులసి, ధానియా, పుదినా, ఇలాచి, చ్యవాన్‌ప్రాష్, నారింజ, పైనాపిల్, స్ట్రాబెర్రీ, కివి, నిమ్మ, గులాబీ, ఆమ్లా, చాక్లెట్, ఖాజూర్,  బీట్ రూట్ వంటి వివిధ ఆసక్తికరమైన రకాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.

దుర్గా పూజ నుండి, స్వీట్స్ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తన దుకాణానికి రావడం ప్రారంభించిన తరువాత అతని వ్యాపారం బాగా  పుంజుకుంది.దుకాణంలో విక్రయించడమే కాకుండా,  స్వీట్స్ ప్యాకెట్లను హోమ్-డెలివరీ  చేయడం కూడ ప్రారంబించాడు.రాబోయే దీపావళి, భాయ్ దూజ్ మరియు చాత్ పండుగలకు అమ్మకాలు మరింత పుంజుకుంటాయని అగర్వాల్ భావిస్తున్నాడు.

ఈ ఏడాది మార్చిలో కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత అగర్వాల్ తీపి తయారీ వ్యాపారం నిలిచిపోయింది. అయితే, అన్‌లాక్ మార్గదర్శకాలను ప్రకటించిన తర్వాత తన వ్యాపారాన్ని పెంచడానికి ఈ రోగనిరోధక శక్తిని పెంచే రాస్‌గుల్లాలను సిద్ధం చేయాలని అగర్వాల్ నిర్ణయించుకున్నాడు. అగర్వాల్ తయారు చేస్తున్న రసగుల్లాలు రోగనిరోధక శక్తిని పెంచగలవని జార్ఖండ్ ప్రభుత్వ  ఆయుష్ వైద్యుడు భరత్ కుమార్  చెప్పడం విశేషం. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox