Sri Lanka: కరోనా నేపధ్యంలో రెండేళ్లకిందట చాలా దేశాలతో పాటు శ్రీలంక కూడా కోవిడ్ లాక్ డౌన్ లోకి వెళ్ళింది. దీనితో దేశంలో ప్రధాన పరిశ్రమలైన టీ, వస్త్రాలు, పర్యటకం తీవ్రంగా దెబ్బ తిన్నాయి. స్థిరమైన ఆదాయం లేక, దేశ ఆర్ధిక పరిస్థితి బాగా క్షీణించింది. సెంట్రల్ బ్యాంక్ చేతిలో ఉన్న విదేశీ మారక ద్రవ్య విలువలు కూడా బాగా పడిపోయాయి.
ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారడంతో, అమెరికన్ డాలర్లకు సరళమైన విదేశీ మారక రేటును ప్రవేశపెట్టాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. దేశంలో ఏర్పడిన డాలర్ కొరతను సర్దుబాటు చేసేందుకు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొరత దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయికి చేరింది.దీంతో, విదేశీ మారక ధరలు పెరిగాయి. బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో విదేశాల నుంచి వచ్చే డాలర్ల రాక పెరుగుతుందని భావించింది.ఈ నిర్ణయం అమలు చేసిన తర్వాత శ్రీ లంకన్ కరెన్సీలో రూ.230 ఉన్న యూఎస్ డాలర్ విలువ రూ. 270 కి పెరిగింది.దీంతో, శ్రీలంకలో వస్తువులు, సేవల ధరలు కూడా ఊహించని రీతిలో పెరగడం మొదలయింది.
కేజీ చికెన్ వెయ్యి రూపాయలు, ఒక్కో గుడ్డు 35 రూపాయలు, కిలో ఉల్లిపాయలు 250, బియ్యం 200 రూపాయలు అయ్యాయి. పెట్రోల్ బంకుల వద్ద వేల వాహనాలు బారులు తీరుతున్నాయి. దీంతో పరిస్థితి అదుపులో లేకుండా పోయింది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ రెట్టింపయ్యాయి. వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూసుకుపోయాయి. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. 1970లలో సిరిమావో బండారు నాయకే ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు, శ్రీలంకలో కరువు ఏర్పడిందని చెబుతారు. కానీ, ప్రస్తుతం ఉన్న సంక్షోభం దాని కంటే దారుణంగా ఉందని చాలా మంది అంటున్నారు.

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022