ఆన్లైన్లో భారీ వ్యతిరేకత ఎదురైన తర్వాత బర్గర్ కింగ్ లింగ సమానతలపై వారు చేసిన ఉమెన్స్ డే ట్వీట్‌ను తొలగించారు. వారు ఈ పోస్ట్ విషయమై క్షమాపణ కూడా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బర్గర్ కింగ్ యాజమాన్యం ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది. అయితే, ఈ పోస్ట్ పై నెటిజెన్లలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఉమెన్స్ డే రోజున బర్గర్ కింగ్ ట్విట్టర్ ఖాతా నుంచి ఓ పోస్ట్ వేశారు. మహిళలను వంట గదివైపుకు రప్పించడానికి వారు స్కాలర్ షిప్ లు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటన చేయాలనుకున్నారు. "మహిళలు వంటగదికి పరిమితమయ్యారు" అంటూ పోస్ట్ చేయడంతో నెటిజెన్ల నుంచి విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో బర్గర్ కింగ్ యాజమాన్యం స్పందించింది. ఈ విషయమై క్షమాపణలు తెలిపింది. మొదట తాము చేసిన ట్వీట్ తప్పు అర్ధంతో ఉన్నందుకు క్షమాపణ చెప్తున్నామని తెలిపింది. యుకెలో రెస్టారెంట్స్ లలో కిచెన్లలో కేవలం ఇరవై శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారని, మహిళా చెఫ్ లను కూడా పెంచడం తమ లక్ష్యమని సదరు సంస్థ పేర్కొంది. ఇందుకోసమే స్కాలర్ షిప్ లు ఇచ్చి మహిళలను కూడా ఎంకరేజ్ చేసే ఉద్దేశ్యంతోనే ఈ పోస్ట్ చేశామని, కానీ, పోస్ట్ ను తప్పుగా అర్ధం చేసుకున్నారని పేర్కొంది.
"ఈ పోస్ట్ ను సరిగా చేయలేదు. దురుద్దేశంతో కూడిన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని కొందరు స్పందిస్తున్నారు. అందుకే ఈ పోస్ట్ ను తొలగించాలని నిర్ణయించుకుంటున్నాం" అని మరో ట్వీట్ లో పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
14 Apr 2021
11 Apr 2021
16 Apr 2021
16 Apr 2021
16 Apr 2021