Breaking News

Summer Health: సమ్మర్ లో ఇలా చేస్తే బెటర్..

30 th Mar 2022, UTC

Summer Health: వేసవికాలంలో చెమట ఎక్కువగా పడుతుండటంతో త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతారు. అందువల్ల మంచినీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే శరీరానికి అంతమంచింది. కూల్ డ్రింకులు, ఐస్ క్రీములు జోలికి ఎక్కువగా పోకుంటేనే మంచింది. వీటివల్ల తాత్కాలికంగా దాహం తీరినట్లు అనిపించినప్పటికీ  వాటి వల్ల శరీరానికి మేలు కన్నా కీడు ఎక్కువ. 

పది కప్పుల పుచ్చకాయ గుజ్జు, కప్పు చెక్కు తీసిన అల్లం ముక్కలు మిక్సీలో లేదా జ్యూస్‌ ఎక్స్‌ట్రాక్టర్‌లో వేసి రసం తీయాలి. చల్లదనం కోసం కొన్ని నిమిషాలు ఫ్రిజ్‌లో వుంచి త్రాగాలి. ఈ రసం వల్ల, జీర్ణక్రియ ఉత్తేజం అవతుంది. రక్తవృద్ధితో, హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. కిడ్నీ, గుండెలకు మంచిది, తగిన నీటి శాతాన్ని కల్పిస్తుంది. అల్లం రసం వల్ల జీర్ణక్రియ సజావుగా ఉంటుంది. శ్వాససంబంధసమస్యలు దరిచేరవు. 

దానిమ్మ గింజలు కప్పు, రెండు కప్పులు ద్రాక్షలో చెంచా పంచదార మొత్తం మిక్స్‌ చేసి ఆ రసాన్ని వడకట్టి ఫ్రిజ్‌లో కొన్ని నిమిషాలు వుంచి సేవించాలి. దానిమ్మ వల్ల అతిసారం, డయేరియా, ప్రేవులలో ఉన్న నులిపురుగులు పోతాయి. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కిడ్నీ, లివర్‌లు ఆరోగ్యంగా ఉంటాయి. హెమోగ్లోబిన్‌ పెరుగుతుంది. గుండె జబ్బుల నివారణకు బాగా పనిచేస్తుంది. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox