Breaking News

ఉల్లి.. నెత్తికెక్కింది మళ్ళీ..!

19 th Oct 2020, UTC
ఉల్లి.. నెత్తికెక్కింది మళ్ళీ..!

ఈ ఏడాది ఉల్లి ధరలు బాగా ఎక్కువగా పెరిగాయి. వాస్తవానికి ప్రతి ఏడాది ఉల్లి ధరలు తగ్గుతుంటాయి. కానీ ఈ ఏడాది దేశానికీ ఉల్లి పంపిణి చేసే మహారాష్ట్రలో భారీగా వర్షాలు పడ్డాయి. దీనితో ఉల్లి పంట బాగా దెబ్బతింది. దీనితో గత వారం రోజులుగా ఉల్లి ధర అంతకంతకు పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ఉల్లి ధర పదిహేనొందలు పలికింది. కానీ ఈరోజు ఉల్లి ధర ఏకంగా ఆరువేలు ఎగబాకింది. దీనితో కిలో ఉల్లి ధర మార్కెట్లో 65 నుంచి 75 రూపాయలు పలుకుతోంది. కోయకుండానే ఉల్లి కన్నీళ్లు పెట్టించేస్తోంది.

దానికి తోడు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురిసిన సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలకు పలు రోడ్డు మార్గాలు దెబ్బ తినడంతో ఉల్లి ట్రాన్స్పోర్ట్ కి అంతరాయాలు ఏర్పడ్డాయి. పొద్దున్నే రైతుబజార్ లో క్యూ కట్టినా ఉల్లి దొరకని పరిస్థితి నెలకొంది. మార్కెట్లోకి ఉల్లి దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి దొరకడం లేదు. మరో వైపు ఉల్లివ్యాపారులు నిల్వ ఉన్న ఉల్లిని ధరలు పెంచి అమ్మేస్తున్నారు. ఉల్లిని పండించిన రైతులకు మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం  కన్నీళ్లు మిగిలాయి. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox