Breaking News

చికెన్‌తో కరోనా వస్తుందా రాదా..? నిపుణులు ఏమంటున్నారు..?

19 th Aug 2020, UTC

కరోనా :కరోనా మన జీవితాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతిదాన్ని భయంతో చూడ్డం అలవాటైపోయింది. ఆఖరికి తినే తిండిని సైతం మనశ్శాంతిగా తినే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే రీసెంట్ గా చికెన్ లో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించడం నాన్ వెజ్ లవర్స్ మళ్ళీ టెన్షన్ లో పడ్డారు. చైనాలో తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన చికెన్ లవర్స్‌ని కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేసింది. మరి ఇంతకీ చికెన్‌ తింటే నిజంగానే కరోనా వస్తుందా? నిపుణులు ఏమంటున్నారు? ఓసారి చూద్దాం.

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ఈ వైరస్ కట్టడికి ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి మాత్రం ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇపుడు కొత్తగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది. చికెన్‌లో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని చైనా అధికారిణి ఒకరు కనుగొన్నారు. ఈ చికెన్ బ్రెజిల్ నుంచి చైనాలోకి దిగుమతి అయింది. అంతేకాకుండా, ఈ వారం ఈక్వెడార్ నుంచి వచ్చిన ఎండ్రకాయలు, చేపలకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. జూన్‌ నెలలో బ్రెజిల్‌ సహా మరికొన్ని దేశాల నుంచి మాంసం దిగుమతులను చైనా నిలిపివేసింది.

నిజానికి, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతునున్న ప్రారంభ రోజుల్లో కోడిమాంసం నుంచి కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందన్న ప్రచారం జరిగింది. దాంతో, ఎంతో మంది కోడిమాంసాన్ని కొనడాన్ని మానేశారు కూడా. దాంతో, చికెన్ ధరలు పడిపోయాయి. ఆ తరువాత ప్రజల్లో ఈ భయాందోళనలను తగ్గించేందుకు చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందన్న ప్రచారం జరిగింది. దాంతో, చికెన్‌ను కొనేవారు క్రమంగా పెరిగారు. అయితే, రీసెంట్ న్యూస్ మాత్రం మళ్ళీ అలజడిని కలిగిస్తోంది.  బ్రెజిల్ నుంచి దిగుమతి చేసిన చికెన్ వింగ్స్ లో కరోనా వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో ఆందోళన మొదలైంది. ఈ విషయంపై ఇంటర్నేషనల్ మీడియాలో వివిధ కథనాలు వచ్చాయి. దీంతో, ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

చికెన్ తో కరోనా వ్యాప్తి జరుగుతుందన్న న్యూస్ ఇదివరకు కూడా రావడంతో చాలా మంది చికెన్ ను తినడం మానేశారు. నిజానికి, చికెన్ తినడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. దాంతో పాటు మరెన్నో 1హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే చికెన్ తినే విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారంటే, వైరస్‌లు మైనస్ 20 డిగ్రీస్ సెల్సియస్ లో రెండు సంవత్సరాల పాటు సర్వైవ్ అవుతాయట. ఐతే, ఫ్రోజెన్ ఫుడ్ ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందన్న విషయాలు ఇంకా నిరూపణ కాలేదని సైంటిస్ట్ లు అలాగే అఫీషియల్స్ చెబుతున్నారు. అయితే, ఆహారం విషయంలో అలాగే ఫుడ్ ప్యాకేజింగ్ తో పాటు ఫుడ్ డెలివరీ విషయంలో ప్రజలు భయపడనవసరం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్పష్టం చేస్తోంది.

ఆహారం ద్వారా అలాగే ఫుడ్ ప్యాకేజింగ్ ద్వారా కోవిద్-19 వ్యాప్తిచెందుతున్నట్టు ఎటువంటి ఎవిడెన్స్ లేదని యూఎస్ "ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్" ఒక స్టేట్మెంట్ లో వెల్లడించింది. అంతేకాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఈ వైరస్ ఫుడ్ ద్వారా వ్యాప్తి చెందే అవకాశాలు దాదాపు లేనట్లే. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రల్ మరియు ప్రివెన్షన్ ప్రకారం ఆహారం నుంచి ఈ ఇన్ఫెక్షన్ కు గురయ్యే ప్రమాదం తక్కువే. కాబట్టి, చికెన్ ను తినడం పూర్తిగా సురక్షితం. ఆనిమల్ లేదా బర్డ్ కు చెందిన మీట్ ను తినడం వల్ల ఇన్ఫెక్షన్ కు గురైన సందర్భాలు లేవని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, చికెన్ లో ప్రోటీన్ కంటెంట్ అధికంగా లభిస్తుంది. స్ట్రెంత్ ను బిల్డ్ చేసుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. ఇందులో లోఫ్యాట్, లీన్ ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. మజిల్ గ్రోత్ అలాగే డెవలప్మెంట్ కు ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుందట. అటు,హెల్తీ డైట్ మెనూలో చికెన్ కు కచ్చితంగా స్థానం ఉంటుంది. ఇది లీన్ మీట్. అంటే ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉండదు. కాబట్టి, చికెన్ ను రెగ్యులర్ గా తిన్నా వెయిట్ లాస్ గోల్ ను రీచవడం సులభమేనంటున్నారు ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్. నిజానికి వెయిట్ ను హెల్తీ వేలో మెయింటెయిన్ చేయడానికి కూడా ఇది మంచి ఆప్షన్ అనంటున్నారు. సో, కరోనా భయంతో చికెన్‌ను మానేయాలా అని బాధపడుతున్న చికెన్ లవర్స్‌కి ఈ వార్త ఆనందాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు కదూ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox