Breaking News

అమెరికన్లను వణికిస్తున్న ఉల్లి, కరోనాను మించిన వైరస్..

08 th Aug 2020, UTC

వాషింగ్టన్ : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి తరతరాల నుంచి వస్తోంది. దీన్ని బట్టి ఉల్లి విశిష్టత వేరే చెప్పక్కర్లేదు. ఇక,మన దేశంలో అయితే,ఉల్లి రేటు ఘాటుకు ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. మరి,అలాంటి ఉల్లిని చూసి ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా గజగజా వణికిపోతోంది. ఉల్లిని చూసిన అమెరికన్లు వణకడమా అని అనుమానంగా ఉంది కదా?మరి అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల ఎన్నికల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఉల్లి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక,మన దేశంలో అయితే ఉల్లి లేకుండా వంట జరగనే జరగదు. ఏ కూర వండాలన్నా ఉల్లి కావాల్సిందే. వంటల్లో ఉల్లితో వచ్చే ఆ రుచే వేరంటారు వంటింటి మగువలు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఉల్లి పేరు చెబితేనే అగ్ర రాజ్యం భయపడుతోంది. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఉల్లిపాయల వల్ల భయంకర మైన సాల్మోనెల్లా వ్యాధి దేశాన్ని చుట్టేస్తోంది. కరోనాను మించి దీని ప్రభావం ఉంటుందని అక్కడి వైద్యులు అంచనా వేస్తున్నారు.  సాల్మోనెల్లా ప్రధానంగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుంది.

నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. తాజాగా ఉల్లి పేరు చెబితేనే అమెరికా భయపడిపోతోంది.. ఉల్లిపాయల నుంచి సోకే భయంకరమైన సాల్మోనెల్లా వ్యాధి ప్రస్తుతం దేశాన్ని చుట్టేస్తోంది. కరోనా వైరస్‌ను మించిన ప్రభావం దీని వల్ల ఉంటుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఈ సాల్మోనెల్లా వ్యాధి పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధి గురించి అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.ఫుడ్ పాయిజన్ కలిగించే సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య అమెరికా, కెనడాల్లో ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇప్పటి వరకు అమెరికాలోని 34రాష్ట్రాల్లో 400మంది ఈ బ్యాక్టీరియా బారినపడినట్లుగా తెలుస్తోంది.

ఈ వ్యాధి కారణంగా డయేరియా జ్వరం,కడుపునొప్పి వంటివి వస్తాయని వైద్యులు చెబుతున్నారు. సాల్మోనెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవని వైద్య నిపుణులు చెబుతున్నారు. 8 గంటల నుంచి 72 గంటల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయని,అవి కూడా 4 రోజుల నుంచి 7 రోజుల పాటు ఉంటాయని అంటున్నారు. అయితే దీనికి ఓ చిట్కా సైతం ఉందట. వీలైనంత ఎక్కువగా నీటిని తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చట.  మొత్తానికి మనకెంతో ప్రీతిపాత్రమైన ఉల్లి.. అమెరికన్లను ఈ రకంగా వణికిస్తుందన్నమాట. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox