Breaking News

గంటలో 33 రకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేసిన పదేళ్ల బాలిక

12 th Oct 2020, UTC

కేరళ :కేరళకు చెందిన శాన్వి ఎం ప్రజిత్ అనే పదేళ్ల బాలిక గంటలో 33 రకాల ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి రికార్డు్లో కెక్కింది. ఎర్నాకుళంకు చెందిన ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ప్రజిత్ బాబు కుమార్తె సాన్వి గంటలో ఇడ్లీ, మష్ రూమ్ టిక్కా, పాప్డి చాట్, పాన్ కేక్స్ , పన్నీర్ టిక్కా, ఎగ్ బుల్స్, శాండ్ విచెస్, ఊతప్పం, ఫ్రైడ్ రైస్ లను తయారు చేసింది. ఆగష్టు 29న శాన్వి ఈ ఐటమ్స్ ను తయారు చేయగా ఇది రికార్డల కెక్కింది.

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు విశాఖపట్నంలో శాన్వి తయారు చేసిన ఫుడ్  ఐటమ్స్ ను ఆన్ లైన్ లో చూడగా ఇద్దరు గెజిటెడ్ అధికారులు ప్రత్యక్ష్యంగా హాజరయ్యారు. దీనితో శాన్వి ప్రయత్నం ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయింది.

శాన్వి తల్లి మంజిమ మంచి కుక్. ఆమె ఫుడ్ రియాలిటీ షోలకు హాజరవుతారు. తన తల్లి నుంచి ప్రేరణ పొందిన శాన్వి చిన్నతనం నుంచే పలు రకాల వంటలను తయారు చేయడం మొదలు పెట్టింది. చిల్డ్రన్స్ కుకరీ షోలో పాల్గొని బహుమతులను గెలుచుకుంది. శాన్వికి యూ ట్యూబ్ చానల్ కూడ వుండటం విశేషం. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox