Breaking News

5 పైసలుకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ

06 th Sep 2020, UTC
5 పైసలుకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ
 
చెన్నై :తమిళనాడులోని రామనాథపురంలో 5 పైసలుకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ అంటూ ప్రకటించడంతో జనాలు పోటెత్తారు. రామనాథపురం, కీళక్కరై, పనైకుళం ప్రాంతాల్లో అధికంగా బిర్యానీ దుకాణాలున్నాయి. ఆ ప్రాంతాల్లో వెళ్తుంటే బిర్యానీ వాసనలు తగులుతుంటాయి. అయితే  ఒక బిర్యానీ దుకాణంలో 5 పైసలకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ, పెరుగు పచ్చడి, వంకాయ కుర్మా అందిస్తున్నామనే ప్రకటనతో ప్రజలు బారులు తీరారు. 5 పైసలు చెల్లించి బిర్యానీ తీసుకెళ్లారు.
 
ఈ విషయమై దుకాణ యజమాని ఫరత్‌ మాట్లాడుతూ, రామనాథపురం ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డులో కొత్త బిర్యానీ దుకాణాన్ని ప్రారంభించానని, మాంసాహారప్రియులను ఆకట్టుకొనేలా 5 పైసలకే ప్లేట్‌ చికెన్‌ బిర్యానీ అందిస్తున్నట్టు ప్రకటించానన్నారు. అలాగే, పాత నాణేలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశం కూడా ఇందులో ఇమిడి ఉందన్నారు. 150మంది వరకు 5 పైసలు చెల్లించి బిర్యానీ కొనుగోలు చేశారని ఫరత్‌ తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox