Breaking News

మోదీ ఇడ్లీ... రూ10 కి నాలుగు

02 nd Sep 2020, UTC
మోదీ ఇడ్లీ... రూ10 కి నాలుగు
 
చెన్నై :ఏవ్యాపారానికయినా పబ్లిసిటీ అనేది చాలా అవసరం. అయితే తమిళనాడుకి చెందిన బీజేపీ నాయకుడు ఒకరు తన హోటల్ వ్యాపారానికి ఏకంగా ప్రధాని మోదీ పేరునే వాడేయాలని నిర్ణయించారు. మోదీ ఇడ్లీ పేరుతో తమిళనాడులోని, సేలంలో తక్కువ ధరకు ఇడ్లీలనుఅమ్మబోతున్నట్లు హోర్డింగ్ లు కూడ సిద్దం చేసారు. మోదీ ఇడ్లీలుగా పిలుస్తున్న వీటిని రూ.10కి నాలుగు ఇవ్వనున్నారు. తమిళనాడు బీజేపీ ప్రచార విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ ఈ హోటల్ ను నిర్వహించబోతున్నారు. దీనికోసం రోజుకు 30,000 ఇడ్లీలను తయారు చేయడానికి అవసరమైన మిషనరీని కూడ సిద్దం చేసారని త్వరలోనే ఈ ఇడ్లీ వ్యాపారం ప్రారంభమవుతుందని మహేష్ సన్నిహితులు చెబుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox