Breaking News

రుణాలు పొందండి.. ఇధనాల్ ఉత్పత్తిని పెంచండి..

01 st Oct 2020, UTC

న్యూఢిల్లీ :దేశంలో చక్కెర మిల్లులు ఇధనాల్ ఉత్పత్తిని పెంచడానికి అవసరమయిన రుణాలను అందించడానికి నెల రోజుల పాటు విండోను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 15 వరకూ సమయముంది. రెండేళ్ల కిందటే ప్రారంభించిన ఈ పధకం కింద పలు చక్కెర మిల్లులకు రుణాలను అందజేసారు. ఇధనాల్ ఉత్పత్తి పెంచడానికి చక్కెర కర్మాగారాల్లో వున్న డిస్టిలరీ లను అభివృద్ది పరచడం, కొత్త డిస్టిలరీలను ఏర్పాటు చేయడం కోసం ఈ రుణాలను మంజూరు చేస్తారు.

ఇప్పటివరకూ 68 దరఖాస్తులు రాగా ఈ పధకం కింద రూ.3,500 కోట్లు రుణాలు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇపుడు కొత్తగా రుణాల కోసం దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదివరకు దరఖాస్తు చేసి రుణాలు రానివారు, కూడ మరలా దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు. దేశంలోని చక్కెర మిల్లుల్లో పేరుకు పోతున్న నిల్వలను అడ్డుకోవడానికి ప్రభుత్వం చక్కెర మిల్లుల యాజమాన్యాలను ఇధనాల్ తయారీ దిశగా ప్రోత్సహిస్తోంది. చక్కెర రేటుకన్నా ఇధనాల్ రేటు ఎక్కువగా వున్నందున మిల్లులకు కూడ ఇది ఆర్దికంగా ప్రయోజనం చేకూర్చుతుందన్నది ప్రభుత్వ ఆలోచనగా వుంది. దేశ వ్యాప్తంగా 360 కోట్ల లీటర్ల ఇధనాల్ ను ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వుంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest ఆహార | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox