Breaking News

వ్రోక్లా సిటీ కూడలికి హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు 

26 th Oct 2020, UTC

బాలీవుడ్ :పోలాండ్లోని సిటీ కౌన్సిల్ ఆఫ్ వ్రోక్లా నగరంలోని ఒక కూడలికి అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ పేరు పెట్టింది. దీన్ని అమితాబ్ బచ్చన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసారు. సిటీ కౌన్సిల్ ఆఫ్ ది సిటీ ఆఫ్ వ్రోక్లా, పోలాండ్ కూడలికి నా తండ్రి పేరు పెట్టాలని నిర్ణయించుకుంది. దసరాకు ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఉండకపోవచ్చు. కుటుంబానికి, భారత సమాజానికి ఒక క్షణం గర్వకారణం వ్రోక్లా. అండ్ ఇండియా జైహింద్ "అని  అమితాబ్ రాసారు. జూలైలోప్రఖ్యాత కవిత "మధుషాల" లోని కొన్ని పంక్తులను పఠించడం ద్వారా వ్రోక్లా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు తన తండ్రికి నివాళి అర్పించే ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోను ఈ సందర్బంగా అమితాబ్ షేర్ చేసారు.

ఈ వీడియో క్లిప్‌తో పాటు బిగ్ బి ఇలా వ్రాశారు "గత సంవత్సరం వ్రోక్లా మేయర్ నన్ను పోలాండ్‌లోని వ్రోక్లా నగరానికి రాయబారిగా ప్రకటించారు. ఆ రోజు వారు నా బాబుజీ మధుషాల పఠనాన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులు భవనం టెర్రస్ పై నిర్వహించారు. వ్రోక్లాకు యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్ అనే బిరుదు లభించడంతో, వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాబుజీ ప్రేమికులకు సందేశాన్ని పంపగలరు - వ్రోక్లా అనేది డాక్టర్ హరివంష్ రాయ్ బచ్చన్ నగరం. ఇది భావోద్వేగానికి మించినది. ధన్యవాదాలు వ్రోక్లా అంటూ ముగించారు.

అమితాడ్  బచ్చన్ ప్రస్తుతం టెలివిజన్లో, ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా క్రోరోపతి 12 ను నిర్వహిస్తున్నారు.బ్రహ్మాస్త్ర్ర, ఝుండ్, చెహ్రి సినిమాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ డైరక్టర్ నాగ్ అశ్విన్  ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రంలో కూడ బిగ్ బీ కనిపించబోతున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox