Breaking News

ఇంతకంటే గొప్ప సంతృప్తి ఇంకేముంటుంది.:మెగాస్టార్ చిరంజీవి

15 th Jun 2020, UTC

విలునవైన ఓ ప్రాణాన్ని రక్తదానం చేసి రక్షించడం కన్నా గొప్ప సంతృప్తి కూడా ఇంకోటి లేదనే విషయాన్ని చెబుతూ మెగాస్టార్ చిరంజీవిఎమోషనల్ ట్వీట్ చేశారు . నేడు (జూన్ 14) ప్ర‌పంచ రక్తదాన దినోత్స‌వం సందర్భంగా ఓ స్పెష‌ల్ వీడియో పోస్ట్ చేస్తూ జనాలను మేలుకొలిపే మంచి సందేశమిచ్చారు చిరంజీవి.

ఒకరి జీవితాన్ని కాపాడడం కన్నా సంతృప్తినిచ్చే విషయం ఏముంటుందని ప్రశ్నించిన ఆయన.. ''ర‌క్త‌దానం చేసి మ‌రొక‌రి జీవితాన్ని కాపాడ‌టంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదు. ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేసి, చాలా మంది ర‌క్తం దానం చేస్తున్నార‌ని తెలిసి సంతోషిస్తున్నాను. ఇలాంటి కార్య‌క్ర‌మంలో భాగ‌మ‌వుతున్న ప్ర‌తి ఒక్క‌రికీ హృదయపూర్వక ధ‌న్య‌వాదాలు. రక్త దానం చేయండి.. ప్రాణదాతలు కండి.. అని పేర్కొంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.

పలు సందర్భాల్లో తాను రక్తదానం చేస్తున్నప్పటి ఫోటోలు జోడిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో 'ఠాగూర్' సినిమాలోని ''నేను సైతం'' సాంగ్ ప్లే చేస్తూ రూపొందించిన వీడియో షేర్ చేశారు చిరు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ నేనుసైతం రక్తదానానికి సిద్ధం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్ తరఫున‌ ద్వారా మెగాస్టార్ పలు సేవలు చేస్తున్న విషయం తెలిసిందే.

చిరంజీవి.. ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ అతిత్వరలో తిరిగి ప్రారంభం కానుంది.

రక్తదానం  చేసిన నాగబాబు

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సినీనటుడు, జనసేన నేత నాగబాబు రక్తదానం చేశారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లి ఆయన రక్తదానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తాను కూడా రక్తదానం చేశానని చెప్పారు. రక్తదానం చేయాలని ఆయన ప్రతి ఒక్కరినీ కోరారు. రక్తదానం ఒకరి ప్రాణాన్ని నిలబెడుతుందని.. అందుకే ఇతరుల జీవితాలను కాపాడానికి రక్తదానం చేయాలని ఆయన కోరారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox