Breaking News

పరామర్శకు వెడితే మర్డర్ కేసు పెడతారా? నారా లోకేష్

12 th Sep 2021, UTC

టీడీపీ నేత,  మాజీ మంత్రి నారా లోకేష్ ఏపీ సర్కార్ పై  ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. పరామర్శకు వెడితే మర్డర్ కేసు పెట్టడం వైఎస్ జగన్ నియంతృత్వ పాలనకు నిదర్శనమన్నారు. అక్బర్ బాషాని హింసించిన వైకాపా నేతలు, పోలీసులపై చర్యలు తీసుకోవడం చేతగాని ప్రభుత్వం అతడిని పరామర్శించడానికి వెళ్లినవారిపై కేసులు పెట్టడం మైనార్టీలపై జగన్ రెడ్డి అక్కసును తెలియజేస్తోందని అన్నారు.

పరామర్శకు వెళితే మర్డర్ కేసు పెట్టడం @ వైఎస్ జగన్  నియంతృత్వ పాలనకు నిదర్శనం. వైకాపా నాయకులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక కుటుంబంతో సహా ఆత్మహత్యకు సిద్ధపడిన అక్బర్ బాషాని పరామర్శించడానికి వెళ్లిన మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీ ని అక్రమంగా..అరెస్ట్ చెయ్యడమే కాకుండా మర్డర్ కేసు నమోదు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. 

అక్బర్ బాషాని హింసించిన వైకాపా నేతలు, పోలీసుల పై చర్యలు తీసుకోని చేతగాని ప్రభుత్వం పరామర్శకి వెళ్లిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యడం మైనార్టీలపై జగన్ రెడ్డికి ఉన్న అక్కసుని బయటపెట్టింది.

అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిన మహమ్మద్ ఫారూఖ్ షుబ్లీని వెంటనే విడుదల చెయ్యాలి. అక్బర్ బాషాని వేధించిన వైకాపా నాయకులు, పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox