Breaking News

కొమరం భీం కి ముస్లిం గెటప్పా..?

24 th Oct 2020, UTC
కొమరం భీం కి ముస్లిం గెటప్పా..?

టాలీవుడ్: దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకం గా రూపొందిస్తున్న " ఆర్ ఆర్ ఆర్" సినిమా వివాదం లో చిక్కుకుంది.. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కధాంశాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే..ఈ సినిమా కేవలం కల్పితమని రాజమౌళి చెపుతున్నప్పటికీ.. ఇటీవల విడుదల అయినా కొమరం భీం టీజర్ లో కొన్ని అంశాలు వివాదాస్పదం అయ్యాయి.. కొమరం భీమ్ జయంతి సందర్భంగా  ఇటీవల ఎన్టీఆర్ లుక్ ని రివీల్ చేస్తూ చిత్ర బృందం టీజర్ విడుదల చేసింది. అయితే..ఈ టీజర్ లో ఎన్టీఆర్ ముస్లిం గెటప్ లో కనిపిస్తారు.. ఇదే ఇపుడు వివాదాస్పదం అయింది.

గతం లో విడుదల అయినా రామ్ చరణ్ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తాజాగా విడుదల ఐన "భీం ఫర్ రామ రాజు" కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందించాడు. ఈ టీజర్ లో ఎన్టీఆర్ కు సంబంధించి న కంటెంట్ ఆదివాసీల వీరుడు, మన్యం పులి ముద్దుబిడ్డ కొమురం భీమ్ వీరత్వానికి ఏ మాత్రం తీసిపోని విధం గా ఉంది.. దీనితో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు.. కానీ..టీజర్ చివరిలో ఎన్టీఆర్ టోపీ పెట్టుకుని ముస్లిం లా నడుచుకుంటు వస్తారు.. దీనితో వివాదం మొదలైంది.

అసలు కొమరం భీం పోరాటం చేసినదే నిజాం పాలనకు వ్యతిరేకంగా.. నిజం పాలనను వ్యతిరేకించిన వీరుడి కి టోపీ ఎలా పెడతారంటూ ఆదివాసీలు మండిపడుతున్నారు. తమ ఆదివాసీ నాయకుడిని కించపరిచేలా ఈ సన్నివేశాలు ఉన్నాయని.. వీటిని తొలగించాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు.. ఈ సన్నివేశాలు తొలగించకపోతే కోర్టుకు వెళతామని హెచ్చరిస్తున్నాయి.. అయితే.. కొందరేమో చరిత్రను మార్చకుండా సినిమా తీయాలని.. మరికొందరేమో ఇది ఫిక్షనల్ అని ముందే చెప్పారుగా.. అని వాదించుకుంటున్నారు. ఈ వివాదం విషయమై రాజమౌళి ఇప్పటివరకు స్పందించలేదు. మరిన్ని సినిమా వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox