Breaking News

ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీంకి టోపీ ఎందుకు పెట్టారు..?

28 th Oct 2020, UTC

టాలీవుడ్ :ఇటీవల "ఆర్ ఆర్ ఆర్" సినిమా నుంచి కొమరం భీం టీజర్ విడుదల అయిన సంగతి విదితమే. అయితే ఈ టీజర్ లో ఎన్టీఆర్ టోపీ పెట్టుకోవడం వివాదాస్పదమైన సంగతి విదితమే. ఓ  మత విశ్వాసాలు ప్రతిబింబించే విధంగా కొమరం భీం పాత్రని పోషిస్తున్న ఎన్టీఆర్ కు టోపీ ధరించడం పట్ల ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రగడ పై తాజాగా బీజేపీ ఎంపీ కూడా స్పందించి రాజమౌళికి హెచ్చరిక ఇచ్చారు.

అయినప్పటికీ రాజమౌళి ఈ  వివాదం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఈ సినిమాలో కొంత భాగమంతా ఎన్టీఆర్ టోపీ గెటప్ లోనే కనిపిస్తారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ సినిమాలో ఈ వేషం తీయించడం సాధ్యం కాదట. ఈ సినిమాలో ఎన్టీఆర్ అజ్ఞాతవాసంలో ఈ వేషంలోనే కనిపిస్తారట. చాల కీలకమైన భాగమంతా ఈ గెటప్ లోనే తీస్తారట. అయితే ఎన్టీఆర్ ని ముస్లింగా చూపించడం లేదు కాబట్టి, ఈ సినిమా విడుదల అయినా తరువాత అందరికి ఈ విషయమై క్లారిటీ వస్తుందని ఈ గొడవ కూడా సద్దుమణుగుతుందని రాజమౌళి భావించి మౌనంగా ఉంటున్నారని సమాచారం.

అయితే కేవలం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం కోసమే టీజర్ లో ఎన్టీఆర్ ను ముస్లిం గెటప్ లో ఉన్నట్లుగా చూపించారట. అందుకోసమే ఎన్టీఆర్ గెటప్ ని జక్కన్న వాడుకున్నారని తెలుస్తోంది. అదే ఇన్ని ఆందోళనకు తెర లేపింది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox