Breaking News

విద్యా బాలన్ తో ఆ బీజేపీ మంత్రికి వచ్చిన గొడవేంటి?

30 th Nov 2020, UTC

మధ్యప్రదేశ్ :ఇటీవల, మీ టూ పేరిట తమకు ఎదురైనా ఇబ్బందుల గురించి పలు రంగాల మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి చెబుతున్నారు. సినీ రంగానికి చెందిన వారు ఇందులో ఎక్కువగా పాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరైనా మహిళలను వేధించినట్లు కానీ, వెంటపడినట్లు గాని, లేక అధికారం చెలాయించినట్లు గాని వార్తలు వస్తే, అవి నివురు గప్పిన నిప్పులా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ తరహాలోనే, మధ్యప్రదేశ్ కి చెందిన అటవీ శాఖ మంత్రి విజయ్ షా వార్తల్లో నిలుస్తున్నారు. ముంబై నుంచి, ఢిల్లీ దాకా ఈ వివాదం వినిపిస్తోంది.

ఇటీవల, విద్యా బాలన్ నటిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన యూనిట్ మధ్యప్రదేశ్ అడవుల్లో షూటింగ్ కోసం పర్మిషన్ అడిగారు. అయితే, సదరు బీజేపీ మంత్రి విద్యా బాలన్ ను విందుకు రావాల్సిందిగా కోరారని, అందుకు విద్యాబాలన్ తిరస్కరించిందని ఈ వార్తల సారాంశం. విందుకు అంగీకరించక పోవడంతో, షూటింగ్ కు పర్మిషన్ ఇవ్వకుండా సదరు మంత్రి నిలిపేశారట. ఈ వార్త సంచలనం రేపుతోంది. 

వివరంలోకి వెళితే, విద్యాబాలన్ ప్రధాన పాత్రధారిగా షేర్నీ అనే ఒక సినిమాను నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను మధ్యప్రదేశ్ లో జరుపుతున్నారు.  అయితే, కొంత భాగాన్ని మధ్యప్రదేశ్ అడవుల్లో కూడా షూట్ చేయాలనీ భావించారట. అందుకోసం, పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అటవీశాఖ వారికీ దరఖాస్తు వరకు పంపగా, ఆ దరఖాస్తు మంత్రి వరకు చేరిందట. అయితే..ఈ క్రమంలోనే విద్యా బాలన్ ను డిన్నర్ కి రావాల్సిందిగా మంత్రి విజయ్ షా కోరారట. కానీ విద్యా బాలన్ అందుకు తిరస్కరించారట. అయితే, పర్మిషన్ దొరక్క పోవడంతో ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నిలిచిపోయింది.

ఈ వార్తా వైరల్ అవడంతో, విజయ్ షా స్పందించారు. తానూ డిన్నర్ కి పిలవలేదని వివరణ ఇచ్చారు. తననే ఆ చిత్ర యూనిట్ విందుకు పిలిచిందంటూ వివరించారు. అయితే, తానూ రిజెక్ట్ చేయడంతోనే చిత్ర యూనిట్ విందుని కాన్సల్ చేసేసుకుంది అని వివరణ ఇచ్చారు. అయితే, మంత్రి పదవిలో ఉండి ఓ హీరోయిన్ ను విందుకు పిలిచారన్న అంశం మాత్రం చర్చనీయాంశమైంది. మరిన్ని బాలీవుడ్ వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox