పశ్చిమ బెంగాల్ యువజన సేవల, క్రీడా శాఖల మంత్రి లక్ష్మి రతన్ శుక్లా మంగళవారం తన పదవికి రాజీనామా చేసినట్లు రాష్ట్ర సచివాలయం వర్గాలు తెలిపాయి.శుక్లా తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, దాని కాపీని గవర్నర్ జగదీప్ ధంఖర్ కు పంపారని వారు తెలిపారు.
రాష్ట్ర రవాణా మంత్రి సువేందు అధికారి పార్టీని వదిలి బిజెపిలో చేరిన దాదాపు పక్షం రోజుల తరువాత ఈ మాజీ క్రికెటర్ రాజీనామా చేసారు. బెంగాల్ రంజీ జట్టు మాజీ కెప్టెన్, హౌరా (ఉత్తర) ఎమ్మెల్యే గా వున్న 39 ఏళ్ల శుక్లా, బెనర్జీకి రాజీనామా లేఖలో రాజకీయాల నుండి "రిటైర్" కావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు
హౌరా జిల్లాలో టిఎంసి వ్యవహారాలను చూసుకుంటున్న శుక్లా ఎమ్మెల్యేగా తన పదవిని వదులుకోలేదని వారు తెలిపారు. . బెంగాల్ సీఎం మమతా బెనర్జీ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) నుంచి ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బయటకు రావడం విశేషం. మరిన్ని వార్తలు చదవండి

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
17 Jan 2021
16 Jan 2021
17 Jan 2021
17 Jan 2021