Breaking News

దీదీ ఫినిష్ అన్నారు.. ఇప్పుడేమంటారు? మోదీని ప్రశ్నించిన వర్మ

02 nd May 2021, UTC

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి  హాట్రిక్ సాధించిన మమత మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారానికి సిద్దమవుతున్నారు. ఈ సందర్బంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విటర్‌ వేదికగా ప్రధాని మోదీకి చురకలు అంటించారు. ‘నరేంద్ర మోదీ సార్‌.. నిన్నటి వరకు దీదీ ఫినిష్‌ అని అన్నారు. మరి ఇప్పుడేమంటారు సార్’ అని ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. 

అంతకు ముందు మరో ట్వీట్‌లో సోనియాకు క్షమాపణలు చెబుతానని పేర్కొన్నారు. ‘నరేంద్రమోదీ మృత్యు వ్యాపారి నరేంద్రమోదీ ఓ మృత్యు వ్యాపారి అంటూ 2014లో సోనియా గాంధీ ఆరోపణలు చేస్తే నాకు అప్పుడు సరిగా అర్థం కాలేదు. ఆమెకు అంత గొప్ప విజనరీ ఉంటుందని నేను ఊహించలేదు. 

అందుకు నేను బేషరుతుగా సోనియా గాంధీకి క్షమాపణ చెబుతున్నాను. ఒకవేళ వీలైతే మీ కాళ్లను ఫోటో తీసి పంపండి. వాటిని డిజిటల్ రూపంలో తాకి మొక్కుతాను అని వర్మ ట్వీట్ చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox