Breaking News

కాజల్ ఇంట్లో పెళ్లి సందడి..!

29 th Oct 2020, UTC
కాజల్ ఇంట్లో పెళ్లి సందడి..!

కాజల్ కు పెళ్లి కళ వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో మన చందమామ బ్యాచిలర్ కి గుడ్ బై చెప్పనుంది. కాజల్ అగర్వాల్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లాడబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే కాజల్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.

 ముంబైలో కాజల్ ఇంట్లోనే ప్రస్తుతం ఈ వేడుకలు జరుగుతున్నాయి.. మెహందీ ఫంక్షన్ తో కాజల్ పెళ్లి వేడుక ప్రారంభమైంది. కాజల్ అగర్వాల్ తన చేతికి మెహందీ పెట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియా లో ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేసింది. కాజల్ కు పెళ్లి కళ వచ్చేసింది..ఆ ఆనందం ఆమె ఫొటోల్లో వెల్లివిరుస్తోంది. మరో వైపు కాజల్ ని పెళ్లాడబోయే గౌతమ్ కిచ్లు ఇంట్లో కూడా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.

వరుని ఇంట్లో కూడా పూజలు చేసి గౌతమ్ కి కంకణం కట్టారు. కరోనా బెడద ఉన్న నేపధ్యంలో అతి తక్కువ మంది అతిధుల మధ్య పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలో కాజల్ పెళ్లి వేడుక జరుగుతోంది.పెళ్లి అయినా తరువాత కాజల్-గౌతమ్ లు ఉండడానికి ఇల్లు కూడా సిద్ధం అయింది. తామిద్దరి కోసం కొత్త ఇల్లుని సిద్ధం చేసినట్లు కాజల్ గతంలోనే ప్రకటించింది. ఆ ఇల్లు సర్దుతున్న ఫోటోలను కూడా కాజల్ గతం లో పోస్ట్ చేసిన సంగతి విదితమే. మరిన్ని టాలీవుడ్ వార్తలు చడదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox