Breaking News

మరో సారి రీమేక్ తో రానున్న విశ్వక్ సేన్..!

13 th Jul 2020, UTC

టాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇతర భాషల్లో ఏమైనా చిత్రాలు ఆకట్టుకుని.. విజయవంతమైతే.. వాటిని తిరిగి తెలుగు లో రీమేక్ చేస్తున్నారు.. ఈ తరహాలో ఇప్పటికి ఇలా చాలా సినిమాలే వచ్చాయి.. అవి కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.. కథ, కథనం బాగున్న హిట్‌ చిత్రాలు ఒక భాష నుంచి మరెన్నో భాషల్లో రీమేక్‌ అవుతున్నాయి. ముఖ్యంగా మాలయాళ సినిమాలపై టాలీవుడ్‌ ఇండస్ట్రీ కన్నేసింది.  ఇప్పటికే మలయాళం లో హిట్ అయిన పలు సినిమాలను తెలుగు హీరో లు  రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ‘లూసిఫర్’ రీమేక్‌కు మెగాస్టార్ చిరంజీవి ఓకే చెప్పగా.. ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’, ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ లాంటి చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 
 
        తాజాగా.. "కప్పేలా" సినిమా ను కూడా రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా లో హీరో గా విశ్వక్ సేన్ ను అనుకుంటున్నారట. ఈ మధ్యే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నది. దాంతో సితార ఎంటర్టైన్మెంట్‌ సంస్థ తెలుగు రీమేక్‌ రైట్స్‌ సొంతం చేసుకుంది. ఈ మధ్యే నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్‌’ మూవీతో విశ్వక్‌ మంచి హిట్‌ ఖాతాలో వేసుకున్నాడు.  తాజాగా.. కప్పేలా సినిమా కి కూడా విశ్వక్ అయితే బాగుంటాడని నిర్మాణ సంస్థ యోచిస్తోంది. ఇప్పటికే ఓ మలయాళ మూవీని తెలుగులో చేసి ఉండడంతో విశ్వక్‌ కప్పేలా కూడా అతనే చేస్తాడని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.  ప్రస్తుతం విశ్వక్ సేన్ హిట్ సినిమా సీక్వెల్ లో బిజీ గా ఉన్నాడు.  పాగల్‌ అనే మూవీలో కూడా నటిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లే అయితే.. కప్పేలా సినిమా లో కూడా విశ్వక్ నటించబోతున్నాడు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox