Breaking News

ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ విడుదల.. పాల్గొన్న విజయ్ దేవరకొండ

30 th Oct 2020, UTC

హైదరాబాద్ :ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా విద్యుత్ ఆధారిత వాహనాల పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నేడు హైదరాబాదులో విద్యుత్ ఆధారిత వాహనాల పాలసీ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని, జనవరి నాటికి విద్యుత్ ఆధారిత వాహనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పుకొచ్చారు. వీటి రాకతో హైదరాబాద్ వాసుల జీవన విధానం మారబోతోందన్నారు. 

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల అద్భుత విధానాల ద్వారా తెలంగాణ అభివృద్ధి పరంగా ముందుకు దూసుకుపోతోందన్నారు. గతంలో ఏదైనా సమస్య వస్తే, పరిష్కారం కావడానికి ఎంతో సమయం పట్టేదని, ఇపుడు తక్కువ సమయంలోనే పరిష్కారం లభిస్తోందని కొనియాడారు. విజయ్ దేవరకొండ తన జిల్లాతో పాటు స్వగ్రామానికి కూడా సాగునీరు వచ్చిందని ఈ సందర్భంగా తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్ ఉండడం. సాగునీరు కూడా దొరుకుతుండడంతో రైతులు రెండు పంటలు వేసుకోగలుగుతున్నారన్నారు. ఇప్పటికే రౌడీ బ్రాండ్ పేరిట దుస్తుల రంగంలో వ్యాపారం చేస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా మరో వ్యాపారం కూడా ప్రారంభించబోతున్నారు.

"వాట్స్ అండ్ వోల్ట్స్ " పేరిట విద్యుత్ వాహనాల సంస్థలో భాగస్వామిగా ఉండబోతున్నట్లు  విజయ్ దేవరకొండ ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా విద్యుత్ వాహనాలను తగిన రుసుము చెల్లించి నగర ప్రాంత ప్రజలు అద్దెకు తీసుకోవచ్చు. వంశీ కారుమంచి, విజయ్ మద్దూరి, కేదార్ సెలగంశెట్టి  ఈ సంస్థకి నిర్వాహకులు ఈ సంస్థ గురించి కూడా విజయ్ దేవర కొండ మాట్లాడారు. రాబోయే  రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతుందన్నారు. వీటి ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని అన్నారు. వీటి ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించొచ్చు అన్నారు. అందుకే తాను ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపిస్తున్నానని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox