Breaking News

సల్మాన్ ఖాన్ సినిమాలో విక్టరీ వెంకటేష్

13 th May 2022, UTC
సల్మాన్ ఖాన్ సినిమాలో విక్టరీ వెంకటేష్

Bollywood: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న కభీ ఈద్ కబీ దీపావళి చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమైంది. టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అతను త్వరలోనే సెట్స్‌లో జాయిన్ అవుతాడు. ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకుడు. సల్మాన్ ఖాన్ పక్కన పూజా హెగ్డే నటిస్తోంది.

ప్రస్తుతం కబీ ఈద్ కభీ దీపావళి షెడ్యూల్‌లో సల్మాన్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి చిత్ర నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా స్క్రిప్ట్ రాశారు. కభీ ఈద్ కభీ దీపావళి డిసెంబర్ 30, 2022న విడుదల కానుందని ప్రకటించారు. IIFA అవార్డ్స్ ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లడానికి ముందు సల్మాన్ ఈ షెడ్యూల్ కోసం పది రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటారు. జూన్ మొదటి వారం నుండి మెహబూబ్ స్టూడియోస్‌లో జరిగే రెండవ షెడ్యూల్‌లో వెంకటేష్ కభీ ఈద్ కబీ దీపావళి సెట్స్‌లో జాయిన్ అవుతారు. మరోవైపు సల్మాన్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ త్వరలో టైగర్ 3 షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox