Breaking News

మైసమ్మకు విస్కీ నైవేద్యం పెట్టిన వర్మ

13 th Oct 2021, UTC
మైసమ్మకు విస్కీ నైవేద్యం పెట్టిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను దేవుడిని నమ్మనంటారు. అయితే  ఆయన మంగళవారం మైసమ్మకు  విస్కీ నైవేద్యం పెట్టి సంచలనం సృష్టించారు. వరంగల్ జిల్లా వంచనగిరి గ్రామంలోని గండి మైసమ్మ ఆలయంలో  అమ్మవారికి మందు తాగించారు. నేను వోడ్కా తాగినా మైసమ్మకు మాత్రం విస్కీ తాగించా.. చీర్స్'' అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు వర్మ తీరును తప్పుబడుతూ కించపరిచే కామెంట్స్ చేస్తున్నారు.

కొండా మురళి-సురేఖ జీవితఘటనల ఆధారంగా రాంగోపాల్‌ వర్మ రూపొందిస్తున్న ‘కొండా’ సినిమా షూటింగ్‌ మంగళవారం వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన వర్మ.. సినిమా కొండా మురళికి పాజిటివ్‌గా ఉంటుందా లేక నెగెటివ్‌గా ఉంటుందా అని చాలా మంది పెద్దలు తనను అడిగారని సినిమాలో నిజాన్ని మీ ముందు ఉంచుతా మీరే పాజిటివో నెగెటివో చెప్పాలి’ అని తాను వారికి బదులిచ్చానని వెల్లడించారు. ఈ సినిమా తన ‘శివ’ చిత్రాన్ని దాటిపోతుందని, తన సినిమా జీవితంలో ఒక చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. , ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన కొండా సురేఖ.. తమ జీవిత కథ ఎంతో భిన్నమైనదని, అందుకే రాంగోపాల్‌వర్మ సినిమా తీయడానికి ముందుకువచ్చారని అన్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox