Breaking News

ఉప్పెన విడుదల తేదీ ఖరారు..?

13 th Jan 2021, UTC
ఉప్పెన విడుదల తేదీ ఖరారు..?

టాలీవుడ్ :మెగా ఫామిలీ నుంచి మరో హీరో వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా, మైత్రీ మూవీస్  నిర్మాణంలో సుకుమార్ నిర్మించిన సినిమా "ఉప్పెన". ఈ సినిమాకు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాటలు ఇప్పటికే అలరించాయి. ఈ సినిమా హీరోయిన్ కృతి శెట్టి ఇప్పటికే తెలుగు నాట కుర్రకారు కి నచ్చేసింది. దేవీశ్రీప్రసాద్ ఇచ్చిన ఆడియో హిట్ టాక్ ను తెచ్చేసింది. 

లాక్ డౌన్ కి ముందే షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. కానీ, ఓ వారంలో విడుదల అవుతుంది అనగా లాక్ డౌన్ విధించడంతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఓటిటి ప్లాట్ ఫామ్ లలోను ఈ సినిమా విడుదలకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపలేదు. అయితే, ఈ సినిమా విడుదల కోసం మెగా ఫాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలుత సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉందని భావించారు.

తాజాగా, ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపు ఈ సినిమా నుంచి సంక్రాంతి సందర్భంగా టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox