Breaking News

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుతున్న ఉప్పెన హీరోయిన్!

20 th Nov 2020, UTC

టాలీవుడ్ :సినీ ప్రపంచం ఎంత ఆకర్షిస్తుందో అందరికి తెలిసిందే. అయితే, లక్, టాలెంట్, అందం ఇవన్నీ ఉంటేనే అక్కడ రాణించగలుగుతాం. ఒకసారి పాపులారిటీ వచ్చి,టాలెంట్ ప్రూవ్ అయితే ఇక తిరుగుండదు. అయితే ఒక్కసారి జనాలకి మనం నచ్చడం లేదు అంటే మనకి అవకాశాలు కూడా తగ్గుతుంటాయి. వస్తే, ఒకేసారి ఎక్కువ మొత్తంలో లక్ వస్తుంది. లేదంటే, ఫేడ్ అవుట్ అయిపోవాల్సి వస్తుంది. అందుకే సినీ పరిశ్రమలో కుదురుకున్న వారంతా దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న సామెతను అక్షరాలా పాటిస్తారు. తాజాగా, హీరోయిన్ కృతి శెట్టి కూడా అదే బాటలో వెళుతోందట.

కృతి శెట్టి ఎవరా అనుకుంటున్నారా, అదేనండి "ఉప్పెన" హీరోయిన్. ఈ సినిమా ఇంకా విడుదల కూడా కాలేదు. కానీ ఆమె క్యూట్ లుక్స్ తో మిలియన్ల కొద్దీ ఫాన్స్ ను సంపాదించేసుకుంది. అయితే, చాలా మంది కెరీర్ తొలినాళ్లలో నిర్మాతలు ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. కెరీర్ లో బ్రేక్ వచ్చాక రెమ్యునరేషన్ పెంచుతారు. కానీ ఈ అమ్మడు తోలి సినిమా కూడా విడుదల కాకుండానే రెమ్యునరేషన్ పెంచేసి బెదరగొడుతోంది. గతంలో అయితే ఇచ్చేసేవారు, అయితే కరోనా పీడా దినాల తరువాత ఎక్కువ రెమ్యునరేషన్లు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఆలోచనల్లో పడుతున్నారట.

‘నీ కన్ను నీలి సముద్రం’ అనే వీడియో సాంగ్ లో కృతి శెట్టి తన క్యూట్ లుక్స్ తో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది. ఆమె సాంగ్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ లభిస్తున్నాయి. దీనితో, ఆమె సినిమా ఇంకా విడుదల కాకపోయినా ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు భారీగానే లైన్ కడుతున్నారట. ఇటీవలే, నానితో ఓ సినిమాను ఈ అమ్మడు ఫైనల్ చేసుకుంది. అయితే, తన రెమ్యునరేషన్ ను కొంతమేర పెంచుకుందట. ఇటీవల ఓ నిర్మాత ఆమెను సినిమా కోసం సంప్రదించగా  రూ.70లక్షల రెమ్యునరేషన్ అడిగిందట. అయితే, ఆమెకి డిమాండ్ ఉండడంతో కొందరు నిర్మాతలు ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతున్నారట.  మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox