Breaking News

కంగనా పై దేశ ద్రోహం కేసు..!

17 th Oct 2020, UTC
కంగనా పై దేశ ద్రోహం కేసు..!

బాలీవుడ్ :ప్రముఖ బాలీవుడ్ నటి క్వీన్ కంగనా పై దేశద్రోహం కేసు నమోదైంది. కంగనా పై ఆమె సోదరి రంగోలి పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలంటూ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రో పాలిట‌న్ కోర్డు ఆదేశించింది. సుశాంత్ ఆత్మా హత్య తరువాత కంగనా చేసిన వ్యాఖ్యలు పలు వివాదాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అటు బాలీవుడ్ లోను ఇటు మహారాష్ట్ర లోను పెద్ద దుమారమే లేపాయి. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివాన అయింది. చివరకు శివసేన వర్సెస్ సివంగిలా తయారైంది.

ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆఫీస్ ను కూడా కూల్చేసింది.మరో వైపు కంగనా కూడా ఏమి తక్కువ తినలేదు. అంతకంతకు తెగించే నిలబడింది. అయితే కంగనా ఆవేశం కొద్దీ ముంబైని పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌గా పోల్చడంతో ఈ వ్యాఖ్యలు మరింత వివాదానికి తావిచ్చాయి. ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర సర్కార్ సీరియస్ గా తీసుకుంది.ప‌లు చాన‌ళ్లకు, సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌కు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉండడంతో కాస్టింగ్ డైరెక్ట‌ర్‌, ఫిట్నెస్ ట్రైన‌ర్ మున్నావరలీ సయ్యద్ ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్  కోర్టుకు ఫిర్యాదు చేశారు.

మహారాష్ట్ర సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పాటు పోలీస్ లను కూడా బాబర్స్ అంటూ కంగన పోల్చడం గురించి కూడా ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు కంగనా మరియు ఆమె సోదరి రంగోలి పై దేశద్రోహం కేసు నమోదు చేయాలనీ ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకున్నారు.. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox