Breaking News

మాపై కేసులను సిమ్లాకు బదిలీ చేయండి.. కంగనా రనౌత్, రంగోలి

02 nd Mar 2021, UTC

బాలీవుడ్ :ముంబైలోని వివిధ కోర్టులలో తమపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులను హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు బదిలీ చేయాలని కోరుతూ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో జావేద్ అక్తర్ దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదు, మరియు మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ట్వీట్లు చేసారంటూ ఈ సోదరీమణులపై దాఖలయిన మరో కేసు కూడ వున్నాయి.కేసుల బదిలీని కోరుతూ, కంగనా మరియు రంగోలి తమపై దాఖలు చేసిన కేసులు తమ ఇమేజ్‌ను కించపరిచే హానికరమైన ఉద్దేశ్యంతో దాఖలు చేశాయని పేర్కొన్నారు.

ముంబయిలో ట్రయల్స్ నిర్వహిస్తే తమ ప్రాణాలకు, ఆస్తికి ముప్పు ఉందని రనౌత్ సోదరీమణులు తమ అభ్యర్ధనలో పేర్కొన్నారు. గతంలో తమకు రాజకీయ నాయకులతో ఏర్పడిన విబేధాల కారణంగా ఆయా వ్యక్తులతో వేధింపులు వుంటాయని వారు అందోళన వ్యక్తం చేసారు. అయితే "శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషనర్లను వేధిస్తున్నట్లు పేర్కొనడం అవాస్తవమని  ప్రభుత్వ న్యాయవాది నీరజ్ శేఖర్ పిటిషన్ దాఖలు చేసారు.

ఈ వారం ప్రారంభంలో బాలీవుడ్ నటిపై ముంబై కోర్టు బెయిల్ వారెంట్ జారీ చేయడంతో కంగనా కేసులను బదిలీ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. గీత రచయిత జావేద్ అక్తర్ తనపై దాఖలు చేసిన పరువునష్టం ఫిర్యాదుకు సంబంధించి మార్చి 1న కోర్టుకు హాజరుకావలసిన కంగనా దాని ముందు హాజరుకావడంలో విఫలమైంది. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox