Breaking News

టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ఈడీ విచారణకు హాజరయిన నవదీప్

13 th Sep 2021, UTC

 టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటుడు  నవదీప్ సోమవారం  ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. తన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఆయన తనతో పాటు తీసుకువచ్చారు.ఈ కేసుకు కేంద్ర బిందువుగా ఉన్న ‘ఎఫ్ క్లబ్‌’ పబ్‌కు నవదీప్ యజమాని కావడంతో దీనిపైనే ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. పబ్ నుంచి డ్రగ్స్ సరఫరా అయిన విషయం నిజమేనా? డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేసారు? వీటికి సంబంధించి చెల్లింపులు, డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలపై అధికారులు  నవదీప్ ను ప్రశ్నిస్తున్నారు.డ్రగ్స్ కేసుతో పాటు.. మనీ లాండరిగ్ బ్యాంక్‌ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.  నవదీప్‌ తర్వాత ముమైత్ ఖాన్, తరుణ్, తనీష్  ఈడీ  ఎదుట హాజరు కావలసి వుంది.

 ఎఫ్-క్లబ్ కేంద్రంగా నవదీప్ అనేక పార్టీలను ఆర్గనైజ్ చేశాడు. ఈ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సప్లై జరిగేదని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ కోణంలోనే అధికారులు నవదీప్ ను ప్రశ్నించనున్నారు. నవదీప్‌ తో పాటు  ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ కు విచారణకు హాజరయ్యాడు.ఈ కేసులో ఈడీ ఇప్పటికే  పూరీ జగన్నాథ్, ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ‌లను విచారించింది.  డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఈ విచారణ జరుగుతోంది. ఇప్పటివరకూ జరిగిన విచారణలో పలు కీలక అంశాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox