Breaking News

వకీల్ సాబ్ నుంచి త్వరలో మూడవ పాట

07 th Mar 2021, UTC
వకీల్ సాబ్ నుంచి త్వరలో మూడవ పాట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతన్న చిత్రం “వకీల్ సాబ్”. దీనిపై  అటు పరిశ్రమ, ఇటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ముందుగా వచ్చిన మగువా మగువ  పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తరువాత వచ్చిన సత్యమేవ జయతేకు కూడ అదే రేంజ్ లో స్పందన వచ్చింది.
 తాజాగా ఈ చిత్రం నుంచి మూడవ పాటను విడుదల చేస్తున్నట్లు గీత రచయిత రామజోగయ్య శాస్త్రి  తెలిపారు. హ్యాట్రిక్ లెక్కల్లో ఉంది రాస్కోరా సాంబా అంటూ పవన్ మార్క్ డైలాగ్ తో  పాట పై హింటిచ్చారు. ఈసారి మెలోడీ టచ్ తో వస్తున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా థమన్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన ఈ సాంగ్ మరో వారంలో రానున్నట్టుగా తెలిపారు. మరి ఇంత కాన్ఫిడెన్స్ గా చెబుతున్న ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

నిన్న రాత్రి విన్నాం. ముచ్చటగా ముద్దుగా అంటూ హ్యాట్రిక్ లెక్కల్లో వుంది. మూడోసింగిల్ అంటూ ఆయన ట్వీట్ చేసారు. మరి ఈ సాంగ్ ఎప్పుడు విడుదల అవుతుందో ఎలా వుంటుందోనని పవర్ స్టార్ అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
 
Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox