Breaking News

రకుల్ సినిమా షూటింగ్ వద్ద ఉద్రిక్తత..సెక్యూరిటీ పై రాళ్ల దాడి..!

23 rd Feb 2021, UTC

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం "అటాక్" సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది.  ఈ సినిమా లో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం హీరో గా నటిస్తున్నారు. అయితే నిన్న రాత్రి సమయం లో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు సినిమా షూటింగ్ ప్రాంతం లో రాళ్ళ దాడికి దిగారు. దీనితో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

లక్ష్యరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 13 న విడుదల చేయాలని భావించారు. అయితే, అందుకోసం చాలా వేగంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే, ధనీపూర్‌లో ఆక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. బాంబు బ్లాస్ట్ సీన్లు కూడా ఉండడంతో పక్కా ఏర్పాట్లను చేసుకున్నారు.

ఈ సినిమా షూటింగ్ చూడడానికి చాలా మంది స్థానికులు అక్కడకి వచ్చి గుమిగూడారు. అయితే షూటింగ్ స్పాట్ వద్ద సెక్యూరిటీ గేట్లను మూసివేశారు. దీనితో అక్కడి ప్రజలు సెట్ పైన గోడ ఎక్కి మరీ షూటింగ్ ను చూడాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో సెక్యూరిటీకి, అక్కడి స్థానికులకు గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సెక్యూరిటీకి గాయాలు తగిలాయి. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox