Breaking News

ఒక్క ఏడాది లో రూ.352.13 కోట్లు... తాప్సినా మజాకా..!

08 th Jun 2020, UTC

ఝుమ్మంది నాదం సినిమా తో.. టాలీవుడ్ లో వెండి తెర కు పరిచయం అయిన తాప్సి ఆ తరువాత బాలీవుడ్ తెర లోను ఓ వెలుగు వెలుగుతోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు... విభిన్నమైన కధాంశాలతో... అక్కడి వారిని ఓ ఊపు ఊపుతోంది. అందం అభినయం లో ఆమెకు ఆమె సాటి. ఆమెపైన వివాదాలు ఎన్ని వచ్చినా... రూమర్లు వచ్చినా.. చెక్కు చెదరని ఆత్మస్థైర్యం తో ఓ మంచి నటి గా ముందుకు సాగుతున్నారు ఆమె.
 
          తాజాగా... గత ఏడాది లో బాలీవుడ్ లో విజయవంతమైన హీరోయిన్ గా ఆమె నిలిచారు. ఒక్కో హీరోయిన్ కు ఒక సినిమా దొరకడమే కష్టమైనా ఈ కాలం లో ఆమె ఏకంగా ఐదు సినిమాల్లో నటించారు. అవి అన్ని ఆమె కెరీర్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.. ఆ చిత్రాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.గత 12 నెలల కాలంలో ఆమె నటించిన సినిమాలు అన్ని కలిపి రూ.352.13 కోట్లు రాబట్టాయి.  దీనితో.. తాప్సి తన కెరీర్ లో మరో రికార్డు ను సొంతం చేసుకుంది. 
 
           గత ఏడాది లో ఆమె నటించిన సినిమాలు..‘బద్లా’ రూ.88 కోట్లు (మార్చి 8 2019), ‘గేమ్‌ ఓవర్‌’ రూ.4.69 కోట్లు (జూన్‌ 14 2019- (కేవలం హిందీలో)), ‘మిషన్‌ మంగళ్‌’ రూ.202.98 కోట్లు (ఆగస్టు 15 2019), ‘సాండ్‌కీ ఆంఖ్‌’ రూ.23.40 కోట్లు (అక్టోబరు 25 2010), ‘థప్పడ్‌’ రూ.33.06 కోట్లు (ఫిబ్రవరి 28 2020) మొత్తం రూ.352.13 కోట్లు వసూలు చేసినట్లు తాజాగా సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. ఈ విషయమై తాప్సి కూడా స్పందించారు. "హో నైస్‌.. ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఈ క్వారంటైన్‌లో ఓ శుభవార్తగా దీన్ని పరిగణించి.. నా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుని సెలబ్రేట్‌ చేసుకోవచ్చు" అని ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox