Breaking News

నెపోటిజం ఎంట్రీ వరకే పనికొస్తుంది... తమన్నా

05 th Jul 2020, UTC

 నటి తమన్నా దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో ఒకరు. . 15 ఏళ్ల వయసులోనే నటిగా సినీరంగ ప్రవేశం చేసిన తమన్నా తొలుత బాలీవుడ్లో కథానాయికగా పరిచయం అయింది. అయితే సక్సెస్ కాకపోవడంతో దక్షిణాదికి మకాం మార్చింది. ఇక్కడ కథానాయికగా వరుసగా అవకాశాలు రావడంతో వాటిని సద్వినియోగం చేసుకుంది. అలా 15 ఏళ్లుగా కథానాయికగా కొనసాగుతోంది.

ఈ విషయంపై నటి తమన్నా స్పందిస్తూ తాను 2005లో చాంద్‌ సా రోషన్‌ సహ్రా అనే చిత్రం ద్వారా కథానాయికగా బాలీవుడ్‌లో పరిచయం అయినట్లు చెప్పింది. తాను ముంబై నుంచి దక్షిణాదికి వచ్చేటప్పుడు తనకు అవకాశం ఇవ్వడానికి ఎవ్వరూ సాయం చేయలేదని పేర్కొంది. తన సొంత ప్రయత్నంలోనే దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌ అంతస్తును దక్కించుకున్నట్లు చెప్పింది

2013లో హిమ్మత్ వాలా చిత్రం ద్వారా మరోసారి తన బాలీవుడ్లో అడుగుపెట్టినా అది ఆమెకు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. మళ్లీ దక్షణాదినే నమ్ముకుంది. ఆ తర్వాత కూడా ఇటీవల ప్రభుదేవా దర్శకత్వంలో ఖామోషీ అనే హిందీ చిత్రంలో నటించింది. అది ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇలాంటి సమయంలో తమన్నా ఇటీవల ఒక భేటీలో నేపోటిజం గురించి మాట్లాడుతూ నేపోటిజం ప్రభావం సినీ రంగంలో ఎంట్రి వరకే పనిచేస్తుందని చెప్పింది.

ఆ తర్వాత జయాపజయాలు అనేవి ప్రతిభపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొంది. వారసత్వం అన్నది సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉంటుందని పేర్కొంది. పలువురు ప్రముఖుల వారసులు ఎవరి సాయం లేకుండానే ఈ రంగంలో రాణిస్తున్నారని తమన్నా చెప్పింది.  

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox