Breaking News

పది సంవత్సరాలు..ఓ సర్కిల్ పూర్తయినట్టుంది:తాప్సీ

09 th Jul 2020, UTC

మంచు లక్ష్మి నిర్మించిన `ఝుమ్మంది నాదం` సినిమాతో హీరోయిన్ తాప్సీ టాలీవుడ్ లో  ఎంట్రీ ఇచ్చింది. . కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఆ చిత్రంతో తాప్సీ గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లోమంచి అవకాశాలు దక్కడంతో అక్కడ తన ప్రతిభను నిరూపించుకుంటోంది..

తాజాగా తాప్సీ నటించిన `తప్పడ్` సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో తాప్సీ నటనను అందరూ అభినందించారు. తాజాగా మంచు లక్ష్మి కూడా `తప్పడ్` సినిమా చూసి తాప్సీని అభినందించింది.

దీనికి తాప్సీ స్పందిస్తూ.. `అబ్బా.. పది సంవత్సరాలు.. నువ్వు నా చెయ్యి పట్టుకుని నడిపించడం దగ్గర్నుంచి.. నిన్ను గర్వపడేలా చేసిన క్షణం వరకు.. ఓ సర్కిల్ పూర్తయినట్టు అనిపిస్తోంది. చాలా సంతోషకర ప్రయాణం. నీ ప్రశంస నాకు అన్నింటికంటే చాలా విలువైనది. బిగ్ హగ్` అంటూ రిప్లై ఇచ్చింది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox