Breaking News

ఫిజిక్స్ విద్యార్దులకు సుశాంత్ సింగ్ మొమోరియల్ ఫండ్ 

21 st Jan 2021, UTC

దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ 35 వ పుట్టినరోజు. ఈ  సందర్భంగా, అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో  ఒక పోస్ట్‌ను  షేర్ చేసారు. : "నిన్ను ప్రేమిస్తున్నాను, భాయ్.  నువ్వు నాలో భాగమే మరియు ఎల్లప్పుడూ అలానే ఉంటావు అంటూ రాసారు. శ్వేతా సింగ్ కీర్తి తన చిన్ననాటి జ్ఞాపకాల నుండి తన  కూతురుతో - ఆడుకునే వరకు సుశాంత్ ఫోటోలను షేర్ చేసారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం గత ఏడాది బాలీవుడ్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది - జూన్ 14 న అతను ముంబై నివాసంలో చనిపోయారు.

 సుశాంత్  35 వ జయంతి సందర్భంగా,  ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు తోడ్పడటానికి బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఖగోళ భౌతిక శాస్త్రం అభ్యసించేవారికి  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మెమోరియల్ ఫండ్ ను ఏర్పాటుచేసారు.  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సైన్స్  కు సంబంధించిన విషయాల్లో ఎంతో ఆసక్తిని కనబరిచే వాడు. అతడు ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త . గ్రహాలను , నక్షత్రాల గమనాన్ని చూడటానికి ఖరీధైన టెలిస్కోప్ ను కూడ వినియోగించేవాడు. అతడుమరణించినప్పటి నుండి సోదరి  శ్వేతా అతని జ్జాపకాలను తరచుగా  షేర్ చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో, ఆమె సుశాంత్ చేతితో రాసిన నోట్ ను  షేర్ చేసింది.  "నేను నా జీవితంలో 30 సంవత్సరాలు గడిపాను, ఏదో ఒకటి కావడానికి ప్రయత్నిస్తున్నాను. నేను మంచిగా మారాలని అనుకున్నాను,నేను ఎలా ఉండాలో అలా లేను.  నా... ఆట తప్పు అని నేను గ్రహించాను అంటూ  సుశాంత్ తన నోట్ లో రాసారు.

కై పో చే !, శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ, కేదార్‌నాథ్, పికె మరియు డ్రైవ్ వంటి చిత్రాల్లో నటనకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మంచి పేరు తెచ్చుకున్నారు. రాజ్‌పుత్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బెచారా జూలై 24 న డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదలైంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox