Breaking News

క్షుద్రపూజలు, నకిలీ మందులు, ఖరీదయిన పార్టీలు..రియా చక్రవర్తి పై వెల్లువెత్తిన ఆరోపణలు

01 st Aug 2020, UTC

బాలీవుడ్ :సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తరువాత ఆయన గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి  పై అభియోగాలు వెల్లు వెత్తాయి. సుశాంత్‌ బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రియా డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుందనే ఆరోపణలు ఉన్నాయి.తాజాగా సుశాంత్‌ సోదరి మితు సింగ్‌ సుశాంత్‌ ప్లాట్‌లో క్షుద్ర పూజలు జరిగాయని, ఒక తాంత్రికుడిని పిలిపించి రియా ఇదంతా చేసిందని ఆరోపించారు. అదేవిధంగా సుశాంత్‌ స్నేహితుడు నీలోత్పల్‌ కూడా క్షుద్రపూజల విషయంలో విచారణ జరిపించాలని కోరారు.  

అదేవిధంగా సుశాంత్‌ ఫిజికల్‌ ట్రైనర్‌ కూడా రియా డాక్టర్‌ ఇచ్చిన మందులు కాకుండా వేరే మందులను  సుశాంత్‌కు ఇచ్చిందని తెలిపాడు. తాను మందుల షాపు వద్దకు వెళ్లినపుడు వారు ఈ మందులు కావాలంటే ప్రిస్క్రిప్షన్ కావాలని అడిగేవారని అనుమానంగా చూసేవారని  అన్నాడు. ఈ మందులు వేసుకోవడంతో సుశాంత్ ఎప్పుడూ నిద్ర పోతున్నట్లే వుండేవాడని  చెబుతున్నాడు. 

సుశాంత్ నివాసంలో విలాసవంతమైన  పార్టీలను రియా, ఆమె సోదరుడు ఇచ్చే వారని వాటికి సంబంధించి ఖర్చులన్నింటికీ సుశాంత్ డబ్బులే చెల్లించే వారన్నాడు. సుశాంత్ ఇంట్లో పనిచేసే వారిని మార్చేసి తనకు నచ్చిన వారిని అక్కడ రియా నియమించిందని వారు అందరి కదలికలు సమాచారం ఆమెకు ఇచ్చే వారని చెప్పాడు. డబ్బు సుశాంత్ ది పెత్తనం రియాది అన్నట్లుగా సాగిందని తెలిపాడు.

సుశాంత్‌ చావుకు రియానే కారణమంటూ పలువురు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. సుశాంత్‌ ఆత్మహత్య విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలని  వారు కోరుతున్నారు.  సుశాంత్‌ మరణంపై విచారణ జరిపించాలని సుశాంత్‌ సోదరి ప్రధాని నరేంద్రమోదీకి కూడా లేఖ రాసిన సంగతి తెలిసిందే. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox