Breaking News

సుశాంత్ పోస్ట్ మార్టం పూర్తి..ఆత్మహత్యే...!

15 th Jun 2020, UTC

బాలీవుడ్ ప్రముఖ నటుడు.. వెండి తెర ధోని పాట్నా లోని తన నివాసం లో నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన తన నివాసం లో ఉరి వేసుకుని కనిపించారు. అయితే... ఆయన ఆత్మహత్య పై పలు అనుమానాలు  వ్యక్తం అవుతున్న నేపధ్యం లో ముంబై పోలీసులు కూడా దీనిని అనుమానాస్పద మృతి గా నమోదు చేసుకున్నారు. మరో వైపు ఆయన మృత దేహానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. 
 
              సుశాంత్ ది ఆత్మహత్య చేసుకునే స్వభావం కాదని పలువురు చెబుతున్నారు. మరో వైపు ఆయన కుటుంబసభ్యులు కూడా ఆయన మృతి పై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీనితో.. పోస్ట్ మార్టం రిపోర్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఆయన పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి అయింది.  అతనికి పోస్ట్‌మార్టమ్ చేసిన డా. ఆర్ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రి వైద్యులు సోమవారం పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. 
 
             ఆయన ఆత్మహత్య చేసుకున్నారని వైద్యులు తమ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడించారు. అయితే.. ఆయన అవయవాల్లో ఎక్కడైనా విష పదార్ధాలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు..ఆయన అవయవాలను జేజే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గత ఆరు నెలలు గా డిప్రెషన్ తో బాధపడుతున్న నటుడు సుశాంత్ తన నివాసమైన ముంబైలోని బాంద్రా అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి సూసైడ్ నోట్ కూడా ఆయన వద్ద కనిపించలేదు. మరో వైపు.. ఆయన మృతి పై ఆయన అభిమానులు..యావత్ చిత్ర సీమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox