Breaking News

ఎఫ్ 3 సినిమాలో హీరోగా సునీల్..?

16 th Oct 2020, UTC
ఎఫ్ 3 సినిమాలో హీరోగా సునీల్..?

టాలీవుడ్ :ఎఫ్ 2 సినిమా తెలుగు నాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అందరికి తెలిసిందే. 2019సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిపోయింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీస్తామని ఈచిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి గతంలోనే ప్రకటించారు. లాక్ డౌన్ టైంలో స్క్రిప్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ఎఫ్ 3 సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.

కానీ ఎఫ్ 2 లో నటించిన వరుణ్ తేజ్, వెంకటేష్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం అవ్వాలంటే చాలా సమయమే పట్టేట్లు ఉంది. దీనితో అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. ఓ వైపు కొత్త సినిమా పనులు చూసుకుంటూ మరో వైపు ఎఫ్3 కోసం మరో కొత్త హీరోని కూడా వెతుకుతున్నారట. ఈ నేపథ్యంలో సునీల్ ఈ సినిమాలో ఓ హీరో పాత్రకి సరిపోతాడని అనిల్ రావిపూడి భావిస్తున్నారట. సునీల్ కూడా కమెడియన్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడవ హీరోగా సునీల్ అయితే బాగుంటుందని అనిల్ రావిపూడి భావిస్తున్నారట. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox