Breaking News

కన్నడ చిరంజీవి కి నివాళులు చెప్పబోయి..తెలుగు చిరంజీవికి చెప్పేసింది..!

08 th Jun 2020, UTC
కన్నడ చిరంజీవి కి నివాళులు చెప్పబోయి..తెలుగు చిరంజీవికి చెప్పేసింది..!
భారత చిత్ర పరిశ్రమలో.. మొదటి నుంచి నార్త్ ఇండియన్ చిత్ర సీమ... సౌత్ ఇండియన్ చిత్రసీమ అంటూ వర్గాలుండనే ఉన్నాయి.. నార్త్ ఇండియన్ వారు మొదటినుంచి సౌత్ ఇండియన్ సినిమాల పట్ల చులకన భావం తో ఉండడం అపుడపుడు బయటపడుతూనే ఉంటుంది. అలంటి సంఘటనే ఒకటి తాజాగా బయటపడింది.
 
          టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవికి ప్రముఖ జర్నలిస్ట్ శోభా డే ఘనంగా నివాళి అర్పించింది.  ప్రముఖ జర్నలిస్ట్ శోభా డే  ‘మరొక తార రాలిపోయింది.. ఎంత విషాదం.. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ చిరంజీవి ఫోటో పెట్టి ట్వీట్ చేసింది. ఇదేంటా అని ఆశ్చర్యపోతున్నారా.. నిజం..! దశాబ్దాల త్వరపడి శోభా డే జర్నలిజం వృత్తి లో ఉన్నారు. అయితే.. ఆమె చూసుకోకుండా కన్నడ నటుడు చిరంజీవి కి నివాళులు చెప్పబోయి మన చిరంజీవి కి ఘన నివాళులు అర్పించేసింది. దీనితో.. కన్నడ చిత్ర సీమ తో పాటు తెలుగు సినిమా అభిమానులు కూడా ఆమె పై మండిపడుతున్నారు.
 
           అసలు విషయం లోకి వెళితే.. నటుడు అర్జున్ సర్జాకు మేనల్లుడైన చిరంజీవి సర్జా(39) నిన్న హఠాత్తుగా గుండెపోటు రావడం తో ఆయన మరణించారు. దీనితో.. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇది చుసిన శోభా డే తాను కూడా పోస్ట్ చేసింది.అయితే.. ఆమె పేరు లోని సారూప్యత ను మాత్రమే గమనించినట్లుంది. ఫోటో కూడా చూసుకోకుండా పోస్ట్ చేసేయడం తో ఈ వార్త కలకలం సృష్టించింది. అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.  చనిపోయింది ఎవరో తెలుసుకోకుండా ఇలాంటింటి ట్వీట్ చేయడమేంటని చిరు అభిమానులు మండిపడుతున్నారు. ఉత్తారాది వారికి దక్షిణాది వారంటే ఎంత చులకనో చెప్పడానికి ఇది అద్దం పడుతోందంటున్నారు. మరోపక్క.. చిరంజీవి సర్జా అర్జున్‌కు మేనల్లుడు అవుతాడని వివరిస్తూ నటి ఖుష్బూ వివరంగా పోస్టు పెట్టింది. ప్రతి చిన్న విషయము వైరల్ అవుతున్న నేటి సోషల్ మీడియా కాలం లో ఏమైనా పబ్లిక్ కి చెప్పేముంది చూసుకుని పెట్టడం మంచిది. సెలబ్రిటీ ల విషయం లో మరింత జాగ్రత్త గా ఉండి వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox