Breaking News

సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలకు కోట్లాదిరూపాయలు టోపీ పెట్టిన శిల్పా చౌదరి

27 th Nov 2021, UTC

సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తల నుంచి శిల్ప డబ్బులు తీసుకుని మోసం చేసిందనే ఫిర్యాదులు రావడంతో హైదరాబాద్ పోలీసులు   శిల్ప చౌదరి  అనే మహిళను  అరెస్ట్ చేశారు.చర్యలు తీసుకున్నారు. శిల్ప బాధితుల్లో ముగ్గురు టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫేజ్ త్రీ పార్టీల పేరుతో సెలబ్రిటీలను ఆకర్షించిన శిల్ప.. అధిక వడ్డీ రేట్లు ఇస్తానని చెప్పి రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు దండుకుని మోసం చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి

శిల్ప చౌదరి తన బంధువుకు చెందిన ఉన్నత పాఠశాలలో పెట్టుబడి పెడతానని తప్పుడు వాగ్దానంతో కొందరి నుంచి డబ్బలు సేకరించింది. మరికొన్ని సందర్భాల్లో అధిక వడ్డీకి హామీ ఇచ్చి పలువురి నుంచి డబ్బు వసూలు చేసింది. బాధితులను ఆమె ఇప్పటి వరకు కోట్లాది రూపాయల మేర మోసం చేసిందని పోలీసులు  తెలిపారు.  ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను విచారించి.. శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. 

శిల్ప చౌదరి బాధితుల్లో నటులు మరియు బ్యూరోక్రాట్‌లతో సహా ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ప్రముఖ టాలీవుడ్ నటుడు అతని భార్య కూడా శుక్రవారం రాత్రి మహిళపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమెపై మరిన్ని ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox