Breaking News

రెండు దశాబ్దాల తరువాత ప్రేక్షకుల ముందుకు షాలిని

21 st Jul 2021, UTC

కోలీవుడ్‌ :మణిరత్నం దర్శకత్వం వహించిన 2000 సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామా అలైపాయుతే (తెలుగులో సఖి అందరికీ గుర్తుంటుంది. ఆ చిత్రంతో హీరోయిన్ షాలినికి మంచి పేరు వచ్చింది. అయితే స్టార్ హీరో అజిత్‌ను వివాహం చేసుకున్న తరువాత షాలిని సినిమాలను వదిలి కుటుంబం పై దృష్టి పెట్టారు. కోలీవుడ్‌ తాజా సమాచారం ప్రకారం ఆమె ఇప్పుడు రెండు దశాబ్దాలకు తరువాత తెరపై కనిపించబోతున్నారు. ఆమె రీఎంట్రీ కూడ మణిరత్నం సినిమానే కావడం విశేషం.

పొన్నీయిన్ సెల్వన్ పేరుతో వస్తున్న ఈ చిత్రంతో షాలిని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిర్మాతలు ఈ వార్తను అధికారికంగా వెల్లడించనప్పటికీ, షాలిని యొక్క వికీపీడియా పేజీ ఆమె తదుపరి చిత్రం పొన్నీయిన్ సెల్వన్ గా చూపిస్తోంది. ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాండిచ్చేరిలో షూటింగ్ ప్రారంభమయింది.

పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా తయారవుతోంది. మొదటి భాగం 2022 వేసవిలో రిలీజవుతుంది. లైకా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సుబాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox