Breaking News

నాలుగోసారి విడాకులు తీసుకుంటున్న రూపర్ట్ మర్దోక్‌

23 rd Jun 2022, UTC

Hollywood: ప్రపంచ మీడియా మొఘల్‌ 91 ఏళ్ల రూపర్ట్ మర్దోక్‌ మరోసారి విడాకులు తీసుకుంటున్నారని వార్తలు గప్పుమంటున్నాయి. ఇది ఆయనకు నాలుగో విడాకులు కావడం గమనార్హం. నటి జెర్రీ హాల్‌ నుంచి ఆయన విడిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరువురి సన్నిహితులు వెల్లడించిన వివరాల ఆధారంగా న్యూయార్స్‌ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. 

న్యూస్‌కార్ప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, బిలియనీర్ అయిన మర్దోక్ 2016లో 65 ఏళ్ల జెర్రీ హాల్‌ ను వివాహం చేసుకున్నారు. అతని కంటే 25 ఏళ్లు చిన్నదైన హాల్‌. ప్రముఖ అమెరికన్ నటి, మోడల్‌. అయితే, వీరి విడాకుల వార్తలపై స్పందించడానికి ఇరువురి ప్రతినిధులు నిరాకరించగా, వారి సన్నిహితులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మర్దోక్‌ ఇప్పటికే పాట్రిషియా బుకర్‌, అన్నా మరియా మన్‌, వెండీ డెంగ్‌తో  పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నారు.

మర్దోక్‌ తన రెండో భార్య మన్‌ నుంచి విడిపోతున్నప్పుడు చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటి. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా విశాలమైన మీడియా సామ్రాజ్యాన్ని నిర్మించిన మర్దోక్ ఆస్తుల నికర విలువ 17.7 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్‌ ఇటీవల వెల్లడించింది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox