Breaking News

పగ పక్కన పెట్టి.. చాలా కాలం తరువాత..!

31 st Oct 2020, UTC
పగ పక్కన పెట్టి.. చాలా కాలం తరువాత..!

టాలీవుడ్ :బండ్ల గణేష్ పరిచయం అక్కర్లేని పేరు నటుడిగా, టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ తెలుగు చిత్ర సీమలో బండ్ల గణేష్ ఓ వెలుగు వెలిగారు. అయితే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి భక్తుడన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన బండ్లన్న ఎక్కువ కాలం నిలవలేకపోయారు. తిరిగి కళామతల్లి దగ్గరకి వచ్చేసారు. ఇటీవల విడుదలైన మహేష్ "సరి లేరు నీకెవ్వరూ" సినిమాలో కూడా బండ్ల గణేష్ ఓ కమెడియన్ గా కనిపించి అలరించారు.

అయితే రాజకీయాల్లో ఉన్న సమయంలోబండ్ల గణేష్ కు వైసీపీ ఎమ్మెల్యే రోజాకు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఓ న్యూస్ ఛానల్ లో డిబేట్ జరుగుతున్న సమయంలో లైవ్ లోనే రోజా కు, బండ్లన్నకు మధ్య వాగ్వాదం మొదలైంది. పవన్ కళ్యాణ్ ను రోజా విమర్శించడంతో బండ్లన్న కూడా విమర్శించారు. ఈ వ్యవహారం ఒకరినొకరు బూతులు తిట్టుకునే వరకు వెళ్ళింది. అయితే తాజాగా బండ్లన్న పోస్ట్ చేసిన ఒక ఫోటో చూసి అందరు షాక్ అయ్యారు.

ఈ ఫోటోలో బండ్లను, రోజా నవ్వుతు కనిపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరైన రోజా-బండ్ల గణేష్ పాత పగలన్నీ పక్కన పెట్టి ఫోటో దిగారు. ఈ ఫోటోని బండ్లన్న ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ " చాలా రోజుల తరువాత రొజాగారిని కలిసాను. మీ కెరియర్ సక్సస్ ఫుల్ గా కొనసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అని పేర్కొన్నారు. మరో వైపు ఇద్దరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.
 
Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox