Breaking News

'షాదీ ముబారక్' రివ్యూ.. 'మొగలిరేకులు' సాగర్ హీరోగా హిట్టు కొట్టాడా..?

06 th Mar 2021, UTC

టాలీవుడ్ :"మొగలిరేకులు" సీరియల్ అప్పట్లో హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో హీరోగా కనిపించిన సాగర్ వెండితెరపై కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. మిష్టర్ పర్ఫెక్ట్ లో కూడా కనిపించిన సాగర్ "షాదీ ముబారక్" తో పూర్తి స్థాయి హీరోగా మారారు. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా, ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఈ సినిమా కథ పరంగా సింపుల్. మాధవ్ (సాగర్) విదేశాల్లో ఉంటాడు. ఆస్ట్రేలియాలో సెటిల్ అయినా మాధవ్ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అందుకోసం ఇండియా కి వచ్చి హైదరాబాద్ లో ఓ మాట్రిమోనీలో వివరాలు ఇస్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురు ను కలుస్తాడు. మాధవ్ కు చుసిన అన్ని సంబంధాలకు వీరిద్దరూ కలిసే వెళ్తారు. ఈ క్రమంలో వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. వీరి ప్రేమకి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి. వీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకున్నారు అన్న ప్రశ్నకి సమాధానమే ఈ సినిమా.

కథ తెలిసిన కథలానే అనిపించినా కధనం పర్వాలేదనిపిస్తుంది. సాగర్ నటనకు వంక పెట్టడానికి వీలు లేదు. అనుభవం ఉన్న నటుడిలానే కనిపించదు. హీరోయిన్‌ దృశ్య రఘునాథ్ అందం, అభినయం ఈ సినిమాకి ప్లస్ పాయింట్లే. తక్కిన పాత్రధారులు కూడా పరిధి మేర నటించారు. ఈ సినిమా నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, కోరియోగ్రఫీ, ఇతర సాంకేతిక నిపుణుల విభాగాల పని తీరు కూడా బాగుంది. సినిమా చూడడానికి రిచ్ గానే ఉంది. కథ పాతగా అనిపించినా సినిమా కొత్తగానే ఉంటుంది. రొమాన్స్, కామెడీ అంశాలు ఆకట్టుకుంటాయి. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox