Breaking News

వచ్చే జన్మంటూ ఉంటే మేయర్ కుక్కగా పుడతాను.. రామ్ గోపాల్ వర్మ

07 th Mar 2021, UTC

వచ్చే జన్మంటూ ఉంటే హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కుక్కగా పుట్టాలని కోరుకుంటున్నానని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇటీవల తన పెంపుడు కుక్కకు అన్నం తినిపిస్తున్న వీడియోని చూసాక తాను ఎమోషనల్ గా మారానని వర్మ ట్వీట్ చేసారు. పెంపుడు కుక్కను ప్రేమించిన తీరు చూస్తే ఆమెను ఇంటర్నేషనల్ మేయర్ ఆఫ్ డాగ్‌గా నియమించాలని అభిప్రాయం కలిగింది అంటూ వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. మాఫియా, క్రైమ్ లాంటి సినిమాలు తీసిన నాలో క్రూరత్వం ఉందని అంతా అనుకొంటారు. కానీ నాలో ఇలాంటి మానవత్వం, ప్రేమ కూడా ఉందనే విషయాన్ని చెప్పడానికే నేను ట్వీట్ చేశాను అని వర్మ పేర్కొన్నారు. 

ఆ వీడియో చూసిన తర్వాత ఆమె ఫ్యామిలీనే కాకుండా పార్టీని, కేటీఆర్‌ను, కేసీఆర్‌ను, తెలంగాణ ప్రజలను ప్రేమిస్తారా అనేది డౌట్‌గా ఉంది. తన పెంపుడు కుక్కను ప్రేమించడం చూస్తే అలాంటి అనుమానం వచ్చింది. అందరూ డాగ్‌ను చూసి జెలసీగా ఫీలవుతారు అని తన ట్వీట్‌లో వర్మ పేర్కొన్నారు. హైదరాబాద్ మేయర్ తన పెంపుడు కుక్క పై చూపించే ప్రేమను చూస్తే, ప్రజలను కూడా అంతగా ప్రేమిస్తుందా అనే విషయం ఆశ్చర్యంగా ఉంది. వచ్చే జన్మంటూ ఉంటే నేను ఆమె పెంపుడు కుక్కలా జన్మించాలి. ఆమె నుంచి అంతగా ప్రేమను పొందాలి అంటూ ట్వీట్ చేశారు.

మేయర్ విజయలక్ష్మీ చూపించిన ప్రేమను ఇంత వరకు తాను చూడలేదు. నా తల్లి నుంచి కూడా అలాంటి ప్రేమను పొందలేదు. అందుకే నేను మళ్లీ జన్మంటే ఉంటూ కుక్కగా పుట్టాలని కోరుకొన్నాను అని వర్మ  అన్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox