Breaking News

నవంబర్ 26న 'జీ 5' ఓటీటీ లో రిపబ్లిక్ రిలీజ్

24 th Nov 2021, UTC

సాయి తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో జీబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'రిపబ్లిక్'. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు, పాలకులు, ప్రజల పాత్ర ఏమిటన్నది వివరిస్తూ రూపొందిన చిత్రమిది. ప్రజలను చైతన్యపరిచేలా ఉందని విమర్శకులతో పాటు ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది.

ఈ సినిమా 26న జీ 5 ఓటీటీ వేదికలో విడుదల కానుంది. అదీ డైరెక్టర్ కామెంటరీతో! వీక్షకులకు ఎప్పుడూ కొత్తదనం అందించడం కోసం తపనపడే 'జీ 5' ఓటీటీ వేదిక… డైరెక్టర్ కామెంటరీతో 'రిపబ్లిక్' సినిమాను డైరెక్టర్ కామెంటరీతో సినిమాను విడుదల చేయాలనే సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

సాయి తేజ్ ఓ ఆడియో మెసేజ్ పంపించారు. అందులో ఆయన మాట్లాడుతూ "హాయ్! నేను మీ సాయి ధరమ్ తేజ్. నాపై మీరు చూపించిన ప్రేమాభిమానాలు, నా కోసం మీరు చేసిన ప్రార్థనలకు థాంక్స్. 'రిపబ్లిక్' సినిమా మీతో కలిసి చూడటం కుదరలేదు. 'జీ 5' ఓటీటీలో నవంబర్ 26న విడుదల అవుతోంది. సినిమా చూడండి... మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై హింద్" అని అన్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు కంటెంట్, జీ స్టూడియోస్ - ప్రసాద్ నిమ్మకాయల మాట్లాడుతూ "దేవ్ కట్టా గారు 'ప్రస్థానం' తర్వాత, ఆ సినిమాలా పది కాలాలు గుర్తుంచుకునేలా ఈ 'రిపబ్లిక్'ను తీశారు. ఆయనతో సినిమా చేయడం మాకు దక్కిన గౌరవం అని అన్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox