Breaking News

నెపోటిజం అన్ని రంగాల్లో వుంది:రవీనా టాండన్

09 th Jul 2020, UTC

కెరీర్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారని బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ అన్నారు. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సర్వ సాధారణమని ఆమె పేర్కొన్నారు. ఇక ఇటీవల బాలీవుడ్‌ సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో నెపోటిజమ్‌ వాదన ఉవ్వెత్తున లేచింది.

 నెపోటిజమ్‌ కారణంగానే సుశాంత్‌ చనిపోయాడని అతని అభిమానులతోపాటు కొంతమంది ప్రముఖ నటులు సైతం గళం విప్పుతున్నారు. సుశాంత్‌ మరణించి 20 రోజులు దాటుతున్న నెపోటిజం పై చర్చలు మాత్రం చల్లారడం లేదు.

దీనిపై తాజాగా నటి రవీనా టండన్‌ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో తను స్వయంగా ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ‘బాలీవుడ్‌లో నెపోటిజమ్‌ ఉంది. అందుకు నేను అంగీకరిస్తున్నాను. ప్రతి చోట మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఉన్నారు. వీరిలో చెడ్డవాళ్లు మిమ్మల్ని ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తుంటారు.

నాకు కూడా ఈ అనుభవం ఎదురైంది. వాళ్లు మిమ్మల్ని ఎప్పుడూ దెబ్బతీసేందుకు, సినిమాల నుంచి తప్పించేందుకు ఎదురు చూస్తుంటారు. ఇవన్నీ చిన్నప్పుడు క్లాస్‌రూమ్‌లో చేసే చిల్లర రాజకీయాల్లాంటివి. కానీ ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అయితే మేము గ్లామరస్‌ ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి ఇది ఎక్కువ హైలెట్‌ అవుతోంది’. అని రవీనా అన్నారు. అంతేగాక సుశాంత్‌ మరణాన్ని సంచలనం చేయడం ఆపేయాలని ఆమె కోరారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox